/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-01T094512.156.jpg)
Horoscope
మేష రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో కష్టించి పనిచేసినా ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. ప్రయాణాలు అనుకూలం కాదు. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. వివాదాలకు, వదంతులకు దూరంగా ఉండాలి. ఆర్ధిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది.
వృషభరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఇంట్లో ఉత్సవాలు, వేడుకలు జరుగుతాయి. కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు. దూరప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి.
మిథునరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. స్నేహితుల నుంచి వృత్తి పరంగా, ఆర్ధికంగా లబ్ది పొందుతారు. వ్యాపారంలో ఊహించిన దానికన్నా ఎక్కువ లబ్ది పొందుతారు. ప్రయాణాలు కలిసివస్తాయి. ప్రభుత్వ వ్యవహారాలు ఫలవంతంగా ఉంటాయి.
కర్కాటకరాశి వారికి ఈ రోజంతా అంత అనుకూలం కాదు. గ్రహసంచారం అనుకూలంగా లేనందున అన్ని రంగాల వారికి చేసే పనుల్లో సమస్యలు, చికాకులూ ఉండవచ్చు. కొత్త వ్యవహారాలు మొదలు పెట్టవద్దు. ఇబ్బందులు వస్తాయి. కోపాన్ని తగ్గించుకొని శాంతం వహించండి.
Also Read: Ap-Telangana: ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు అలర్ట్.. 32 రైళ్లు రద్దు, మరో 11 దారి మళ్లింపు..!
సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ప్రతికూల పరిస్థితులతో చికాకుతో ఉంటారు. ఉద్యోగంలో పనిభారం పెరగవచ్చు. జీవిత భాగస్వామితో వాదనలు, వ్యాపార భాగస్వాములతో తగాదాలు ఉండవచ్చు. ఆర్ధిక సమస్యలు, రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి.
కన్యారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాగలలో శ్రమ పెరుగుతుంది. ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు. సన్నిహితులతో వివాదాలు ఏర్పడకుండా మీ మాటను అదుపులో పెట్టుకోండి. ఆరోగ్యం కూడా స్వల్పంగా ఇబ్బంది పెడుతుంది.
తులారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఈ రోజు అనుకూలం కాదు. పనిపట్ల ఏకాగ్రత లోపించడం వల్ల ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురవుతారు. తోటి ఉద్యోగుల సహకారం లోపిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలలో ఫలించవు.
వృశ్చికరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుందని. మేథోపరమైన చర్చల్లో పాల్గొంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. అదనపు ధనాన్ని లేక ఆర్థిక వనరులను ఏర్పాటు చేసుకోవడానికి ఇది మంచి సమయం. అదృష్ట సమయం నడుస్తోంది. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు.
ధనుస్సురాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో తీవ్రమైన జాప్యం ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఈ రోజు మీ సహనానికి పరీక్షగా ఉంటుంది. ప్రయాణాల్లో చోరభయం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి.
మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. కుటుంబ విషయాలలో ఎమోషనల్, సెంటిమెంటల్‌గా ఉండకండి. ఆస్తులు, భూములకు సంబంధించిన వ్యవహారాలకు ఈ రోజు దూరంగా ఉండండి.
కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. బంధు మిత్రులతో కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వ్యాపార విస్తరణ నిమిత్తం ప్రయాణాలు చేస్తారు. వృత్తి పరంగా చాలా ధనం సంపాదించవచ్చు. గౌరవం పెరుగుతుంది. మీ పనితీరుకు పై అధికారులు సంతోషిస్తారు.
మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గ్రహ సంచారం అనుకూలంగా లేనందున చేపట్టిన పనుల్లో ఆలస్యం, ఆటంకాలతో తీవ్ర ఇబ్బందులు పడతారు. కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ పెట్టడం మంచిది. ముఖ్యమైన పనులు చేపట్టకూడదు.
Also Read: Temperature: ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఇండియాలో దబిడి దిబిడే.. IMD వార్నింగ్
Also Read: Minor boy accident: 15ఏళ్ల బాలుడు కారు డ్రైవింగ్.. 2ఏళ్ల చిన్నారి మృతి
horoscope | horoscope-today | todays-horoscope | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates