/rtv/media/media_files/2025/04/01/bziYUwtfPljo5O4pnmGv.jpg)
April Fool's Day Photograph: (April Fool's Day)
ప్రతీ ఏడాది ఏప్రిల్ 1వ తేదీన ఫూల్స్ డే జరుపుకుంటారు. ఉదయం లేచినప్పటి నుంచి ఎవరో ఒకరు మిమ్మల్ని ఫూల్స్ చేయాలని అనుకుంటారు. నీ తలపై అది ఉంది, ఇది ఉందని ప్రాంక్ చేస్తారు. అయితే ఎంతో సరదాగా జరుపుకునే ఈ ఏప్రిల్ ఫూల్స్ ఎలా వచ్చింది? దీన్ని 1వ తేదీనే ఎందుకు జరుపుకుంటారో మీకు తెలియాలంటే స్టోరీపై ఓ లుక్కేయండి.
ఇది కూడా చూడండి: Horoscope Today: ఈ రాశివారు నేడు వివాదాలకు దూరంగా ఉంటే బెటర్!
తెలియక న్యూ ఇయర్ వేడుకలు..
16 శతాబ్దంలో జూలియస్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 1వ తేదీన న్యూఇయర్‌ను జరుపుకునేవారు. ఆ తర్వాత గ్రెగొరియన్ క్యాలెండర్ రావడంతో.. జనవరి 1వ తేదీన న్యూ ఇయర్ జరుపుకునేవారు. ఈ విషయం తెలియక కొందరు ప్రజలు ఏప్రిల్ 1వ తేదీనే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేవారు. దీంతో అందరూ వారిని చూసి జోక్స్ వేయడం మొదలు పెట్టారు. వారిని ఫూల్స్‌గా చూసేవారు.
ఇది కూడా చూడండి: Ashwani Kumar : డెత్ ఓవర్ల స్పెషలిస్ట్.. రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!
Just kidding, I’m actually posting this from my office. Happy April Fool’s Day! 🤪 pic.twitter.com/0DRg6iLWvS
— Chase (@ChaseXu_) April 1, 2025
ఇది కూడా చూడండి: IPL 2025: బోణీ కొట్టిన ముంబై..ఐపీఎల్ లో మరో రికార్డ్
ఇలా ఏప్రిల్ 1వ తేదీన ఫూల్స్ డేని జరుపుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఫూల్స్ డేను జరుపుకుంటారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇలా అందరిపై జోక్స్ వేయడం, ప్రాంక్ చేయడం వంటివి చేసేవారు. ఇలా ఏప్రిల్ ఫూల్స్ డే వచ్చింది. అయితే అప్పటిలో రోమ్ నగరంలో ఏప్రిల్ ఫూల్స్ డే రోజు కొత్త దుస్తులు ధరించి మరి జోక్‌లు వేసుకునేవారట.
ఇది కూడా చూడండి: Ap Weather Alert: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!