/rtv/media/media_files/2025/04/01/iogTz97rzAEatcfWWKhb.jpg)
nityananda no more
వివాదాస్పదస్వామిగా ముద్ర పడిపోయిన నిత్యానంద చనిపోయినట్లుగా ప్రచారం జరుగుతోంది. హిందూ ధర్మాన్ని కాపాడుకోవం కోసం ఆయన తన ప్రాణాలను త్యాగం చేశాడని ఆయన మేనల్లుడు సుందరేశ్వరన్ చెప్పినట్లుగా తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీంతో పోలీసులు విచారణ జరుపుతున్నారు. తమిళ సీనియర్ హీరోయిన్ రంజితతో రాసలీలలు సాగించి చాలా ఫేమస్ అయ్యారు నిత్యానంద . భారతీయ న్యాయస్థానాలలో ఆయనపై అనేక అత్యాచారం, అపహరణ ఆరోపణలు విచారణలో ఉన్నాయి. ఈ కేసుల్లో ఆయన చాలాసార్లు కోర్టుకు కూడా హాజరయ్యారు.
#நித்தியானந்தா இரு நாட்களுக்கு முன்னரே உயரிழந்துவிட்டதாக தகவல்
— E7 Tamil Poll (@E7Tamil) April 1, 2025
இந்து தர்மத்தை காக்க உயிர் தியாகம் செய்துவிட்டதாக நித்தியானந்தாவின் சகோதரி மகன் சுந்தரேஸ்வரன்
வீடியோ மூலம் தகவல் . #Nithyananda pic.twitter.com/iBClJLLhPS
2019లో ఇండియా నుంచి మాయం
ఆ తర్వాత అకస్మాత్తుగా నవంబరు 2019లో ఇండియా నుంచి మాయమయ్యారు నిత్యానంద . చాలాకాలం అజ్ఞాతంలోకి వెళ్ళిన తదనంతరం ఈక్వెడార్ సమీపంలో కైలాస అనే తన స్వంత ద్వీప దేశాన్ని స్థాపించినట్లు, దానికి తానే ప్రధానిగాప్రకటించాడు నిత్యానంద. అంతేకాదు, దానిని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితికి అభ్యర్థన కూడా పంపారు. ఇక 2022 మే నెలలో తాను చనిపోయినట్లు వస్తున్న వార్తలపై నిత్యానంద స్పందిస్తూ తాను చనిపోలేదని, ప్రస్తుతం సమాధిలో(సుప్తావస్థ) ఉన్నానని ప్రకటించారు. నిత్యానంద తన యూట్యూబ్ ఛానల్లో చివరిగా మహాశివరాత్రి రోజు కనిపించారు.
நித்தியானந்தா இறந்து 2 நாட்கள் ஆச்சு.. பகீர் கிளப்பிய வீடியோ : APRIL FOOL செய்கிறதா கைலாசா?#UpdateNews | #Nithyananda | #Kailasa | #Video | #Virla | #TodayTamilNews | #updatenews360https://t.co/IbYm1TX2Mm
— UpdateNews360Tamil (@updatenewstamil) April 1, 2025
అయితే తాజాగా డయాలసిస్ నిత్యానంద బాధపడుతూ రెండు రోజుల క్రితం మరణించాడని వార్తలు వచ్చాయి. నిత్యానంద మేనల్లుడు సుందరేశ్వరన్ ఒక వీడియోలో మాట్లాడుతూ, హిందూ ధర్మాన్ని కాపాడటానికి నిత్యానంద తన ప్రాణాలను త్యాగం చేశాడని అన్నారు. నిత్యానంద స్వస్థలం తమిళనాడులోని తిరువణ్ణామలైలో అరుణాచలం, 2002లో నిత్యానంద పేరుతో తన ప్రజా జీవితాన్ని ప్రారంభించాడు. 2003లో కర్ణాటకలోని బెంగుళూరు సమీపంలోని బిడాడిలో ధ్యానపీఠం అనే ఆశ్రమాన్ని ప్రారంభించాడు.
Also read : Ashwani Kumar : అరటిపండు తిని అదరగొట్టాడు..కేకేఆర్ పతనాన్ని శాసించాడు!