BIG BREAKING: కేరళ మాజీ సీఎం పినరయ్ విజయన్ ఇంట్లో ఈడీ సోదాలు
కేరళ మాజీ సీఎం పినరయ్ విజయన్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. తిరువనంతపురంలో ఉన్న ఆయన ఇంటితో పాటు రాష్ట్రంలో మరికొన్ని ప్రదేశాల్లో ఈ దాడులు చేపట్టారు.
కేరళ మాజీ సీఎం పినరయ్ విజయన్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. తిరువనంతపురంలో ఉన్న ఆయన ఇంటితో పాటు రాష్ట్రంలో మరికొన్ని ప్రదేశాల్లో ఈ దాడులు చేపట్టారు.
2023 అక్టోబర్ 7న జరిగిన దాడిలో పాల్గొన్న హమాస్ సభ్యులను ఇజ్రాయెల్ ఇప్పటికీ లక్ష్యంగా చేసుకుంటోంది. ఆ దాడిలో బాధ్యులైన వ్యక్తులను ఒక్కొక్కరిగా గుర్తించి.. వారిని చంపుతోంది. ఈ క్రమంలో హమాస్ నాయకుడు మహమ్మద్ ఒడెహ్‌ను ఇజ్రాయెల్ సైన్యం హతమార్చింది.
తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా కామారెడ్డి, సిద్ధిపేట, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఎక్కువగా వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ఓ వైపు శాంతి చర్చలకు సిద్ధం అవుతుండగా.. మరోవైపు అమెరికా, ఇరాన్ మధ్య సైనిక ఘర్షణలు మళ్లీ మొదలయ్యాయి. అగ్రరాజ్యం అమెరికా ఇరాన్‌పై భారీ స్థాయిలో దాడులకు పాల్పడింది.
పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని జీలం జిల్లాలో తీవ్ర భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై దీని తీవ్రత 4.8గా నమోదైంది. భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై నమోదైన కేసు వ్యవహారంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విచారణ కోసం ఏపీ పోలీసులు తెలంగాణకు కూడా వెళ్లారని, కానీ నేనే స్వయంగా జోక్యం చేసుకుని, ఆ కేసు వద్దు వదిలేయమని చెప్పాను" అని వెల్లడించారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోపెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ , స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిర్వహించిన ధర్నాలో.. ప్రజా సమస్యలపై గళమెత్తిన ఒక ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్‌పై వేటు వేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
తమిళనాడులో మహిళల భద్రతను పటిష్టం చేసేందుకు సీఎం విజయ్ ‘సింగప్పెన్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్’ (STF)ను ఏర్పాటు చేశారు. ఆ బాధ్యతలను ‘లేడీ సింగం’గా పేరుగాంచిన సీనియర్ ఐపీఎస్ అధికారిణి కె. భవానీశ్వరికి అప్పగించారు. ఈ మేరకు ఆమెను ఎస్టీఎఫ్ ఐజీపీ గా నియమించారు.
ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో కొనసాగుతోంది. తాజాగా తృప్తి డిమ్రి షూటింగ్లో చేరగా, అజీజ్ నగర్ తర్వాత కోటి ఉమెన్స్ కాలేజీలో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు.