/rtv/media/media_files/2025/07/13/kerala-cm-pinarayi-vijayan-2025-07-13-19-16-20.jpg)
Pinarayi vijayan
కేరళ మాజీ సీఎం పినరయ్ విజయన్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. తిరువనంతపురంలో ఉన్న ఆయన ఇంటితో పాటు రాష్ట్రంలో మరికొన్ని ప్రదేశాల్లో ఈ దాడులు చేపట్టారు. అయితే మనీలాండరింగ్ కేసుకు సంబంధించి మొత్తం 12 ప్రాంతాల్లో ఈడీ సోదాలు జరుపుతున్నట్లు సమాచారం. అలాగే కన్నూరులోని ఆయన మరో నివాసంలో కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ సంస్థ చుట్టూ ఈ కేసు తిరుగుతోంది. ఎందుకంటే ఈ సంస్థ విజయన్ కుమార్తె టీ వీణాకు చెందినది. ఇది ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ అనే కంపెనీకి సుమారు రూ.1.72 కోట్లను చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2018 నుంచి 2019 మధ్య ఈ లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తులో బయటపడటంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.
ఇది కూడా చూడండి: Prabhas Spirit: ప్రభాస్ తో తృప్తి డిమ్రి యాక్షన్ షురూ.. ‘స్పిరిట్’ షూటింగ్ ‘స్పెషల్’ అప్డేట్!
Breaking: ED raids 10 locations, including the residence of former #Kerala CM Pinarayi Vijayan!!
— Siraj Noorani (@sirajnoorani) May 27, 2026
This action is being taken in connection with an alleged money laundering case involving the IT firm of Pinarayi's daughter Veena Vijayan!! https://t.co/RcpQQczZG3pic.twitter.com/GLXfaMwUTx
ఆ సంస్థకు చెందిన ఇళ్లలో..
ఆ కంపెనీ ఎలాంంటి సేవలు కూడా అందించకపోయినా చెల్లింపులు జరిగాయని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే ఈడీ అధికారులు విజయన్ కుమార్తె వీణను ఇప్పటికే విచారించారు. ఆమె భర్త, ఎమ్మెల్యే మహమ్మద్ రియాస్ నివాసంలో కూడా ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. వీరితో పాటు సీఎంఆర్ఎల్ సంస్థకు చెందిన వ్యక్తుల ఇళ్లలో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా సోదాలు చేపడుతున్నారు. ఈ ఈడీ సోదాలను అడ్డుకోవాలని సీఎంఆర్ఎల్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. అయితే కేరళ హైకోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో ఈడీ దర్యాప్తు మరింత వేగంగా కొనసాగుతోంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద అధికారులు కేసు నమోదు చేశారు.
ఇది కూడా చూడండి: Tamil Nadu : తమిళనాడులో STF చీఫ్ గా 'లేడీ సింగం'భవానీశ్వరి? ఇంతకు ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా?
#WATCH | Kannur: In the Cochin Minerals and Rutile Limited (CMRL) case, Enforcement Directorate (ED) is conducting searches at 10 premises in Keralam, including the residences of former Chief Minister and present LoP Pinarayi Vijayan. https://t.co/5KYJNnClr8pic.twitter.com/nNu8sDcjMU
— ANI (@ANI) May 27, 2026
Follow Us