Israel-Hamas: ఇజ్రాయెల్ వైమానిక దాడి.. హమాస్ కీలక సూత్రధారి మృతి!

2023 అక్టోబర్ 7న జరిగిన దాడిలో పాల్గొన్న హమాస్‌ సభ్యులను ఇజ్రాయెల్‌ ఇప్పటికీ లక్ష్యంగా చేసుకుంటోంది. ఆ దాడిలో బాధ్యులైన వ్యక్తులను ఒక్కొక్కరిగా గుర్తించి.. వారిని చంపుతోంది. ఈ క్రమంలో హమాస్‌ నాయకుడు మహమ్మద్ ఒడెహ్‌ను ఇజ్రాయెల్‌ సైన్యం హతమార్చింది.

New Update
FotoJet (1)

2023 అక్టోబర్ 7న జరిగిన దాడిలో పాల్గొన్న హమాస్‌ సభ్యులను ఇజ్రాయెల్‌ ఇప్పటికీ లక్ష్యంగా చేసుకుంటోంది. ఆ దాడిలో బాధ్యులైన వ్యక్తులను ఒక్కొక్కరిగా గుర్తించి.. వారిని చంపుతోంది. ఈ క్రమంలో తాజాగా హమాస్‌కు చెందిన నాయకుల్లో ఒకరు అయిన మహమ్మద్ ఒడెహ్‌ను ఇజ్రాయెల్‌ సైన్యం హతమార్చింది. ఈ ఆపరేషన్‌ను ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, రక్షణ శాఖ ఆదేశాల మేరకు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.

ఇది కూడా చూడండి: Prabhas Spirit: ప్ర‌భాస్ తో తృప్తి డిమ్రి యాక్షన్ షురూ.. ‘స్పిరిట్’ షూటింగ్ ‘స్పెష‌ల్’ అప్డేట్!

హమాస్ సభ్యులే టార్గెట్..

తాజాగా గాజా నగరంపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో ముగ్గురు చనిపోగా.. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.  ఈ ఘటనలో మరణించిన వారిలో మహమ్మద్ ఒడెహ్ కూడా ఉన్నారు. ఆయన హమాస్‌లో ప్రముఖ నాయకుడిగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల హమాస్‌ టాప్‌ కమాండర్ ఎజ్జెదిన్ అల్ హద్దాద్ చనిపోయిన తర్వాత ఒడెహ్ ఆ బాధ్యతలను స్వీకరించారు. అయితే బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజుల్లోనే ఇజ్రాయెల్ ఆయనను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడింది. ఈ ఘటనపై ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా స్పందించారు. అక్టోబర్ 7 దాడిలో పాల్గొన్న వారందరినీ గుర్తించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దీంతో ఇజ్రాయెల్‌ తమ చర్యలను ఇంకా కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. 

ఇది కూడా చూడండి: Tamil Nadu : తమిళనాడులో STF చీఫ్ గా 'లేడీ సింగం'భవానీశ్వరి? ఇంతకు ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటో తెలుసా?

ఇదిలా ఉండగా.. 2023 అక్టోబర్ 7న హమాస్‌ ఇజ్రాయెల్‌పై భారీ దాడి చేసింది. ఆ దాడిలో సుమారు 1,200 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అలాగే 250 మందికిపైగా వ్యక్తులను బంధించి గాజాకు తీసుకెళ్లారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఆ దాడి తర్వాతే ఇజ్రాయెల్‌ ప్రతీకార చర్యలు ప్రారంభించింది. అప్పటి నుంచి హమాస్‌ నాయకులను లక్ష్యంగా చేసుకుని ప్రత్యేక ఆపరేషన్లు కొనసాగిస్తోంది.

ఇది కూడా చూడండి: BIG BREAKING : నాగేశ్వర్ కోసం ఏపీ పోలీసులు.. పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన!

Advertisment
తాజా కథనాలు