Prabhas Spirit: ప్ర‌భాస్ తో తృప్తి డిమ్రి యాక్షన్ షురూ.. ‘స్పిరిట్’ షూటింగ్ ‘స్పెష‌ల్’ అప్డేట్!

ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో కొనసాగుతోంది. తాజాగా తృప్తి డిమ్రి షూటింగ్‌లో చేరగా, అజీజ్ నగర్ తర్వాత కోటి ఉమెన్స్ కాలేజీలో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు.

New Update
Prabhas Spirit

Prabhas Spirit

Prabhas Spirit: ప్రభాస్ Prabhas ప్రస్తుతం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా Sandeep Reddy Vanga తెరకెక్కిస్తున్న భారీ సినిమా ‘Spirit’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా తృప్తి డిమ్రి Triptii Dimri నటిస్తుండగా, విలన్ పాత్రలో వివేక్ ఒబెరాయ్ Vivek Oberoi కనిపించనున్నారు.

తాజా సమాచారం ప్రకారం, తృప్తి డిమ్రి తాజాగా షూటింగ్‌లో చేరారు. నిన్న హైదరాబాద్‌లోని అజీజ్ నగర్ ప్రాంతంలో ఆమెకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక ఇప్పుడు చిత్ర బృందం షూటింగ్‌ను కోటి ఉమెన్స్ కాలేజీకి మార్చనుంది. అక్కడ ప్రభాస్, తృప్తి డిమ్రి పై మరికొన్ని ముఖ్యమైన సన్నివేశాలు తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ షూటింగ్ రేపటి నుంచి ప్రారంభం కానుంది.

ఈ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. యాక్షన్ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ చిత్రాన్ని టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ కలిసి నిర్మిస్తున్నాయి. సంగీతాన్ని హర్షవర్ధన్ రామేశ్వర్ అందిస్తున్నారు. ‘Spirit’ సినిమాను 2027 మార్చి 5న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు