/rtv/media/media_files/2025/04/03/PsvX7JTfTvo0sYoRX1WP.jpg)
Rains
తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అధికారులు బిగ్ అలర్ట్ తెలిపారు. గత కొన్ని రోజుల నుంచి ఎండలు తీవ్రంగా ఉన్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు జిల్లాల్లో అయితే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, రామగుండం వంటి ప్రాంతాల్లో పాదరసం 44 డిగ్రీల సెల్సియస్‌ను దాటి మండుతోంది. తీవ్రమైన వడగాల్పుల ప్రభావం వల్ల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. ఈ సమయంలో వరుణ దేవుడు కాస్త ఉపశమనం కల్పించాడు.
ఇది కూడా చూడండి: Prabhas Spirit: ప్రభాస్ తో తృప్తి డిమ్రి యాక్షన్ షురూ.. ‘స్పిరిట్’ షూటింగ్ ‘స్పెషల్’ అప్డేట్!
ఈ జిల్లాలో భారీగా వర్షాలు..
తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా కామారెడ్డి, సిద్ధిపేట, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఎక్కువగా వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. ఈ వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం కూడా ఉన్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చూడండి: Tamil Nadu : తమిళనాడులో STF చీఫ్ గా 'లేడీ సింగం'భవానీశ్వరి? ఇంతకు ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా?
అటు ఏపీలో కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరికొన్ని జిల్లాలో భారీగా ఎండలు ఏర్పడనున్నాయి. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, నెల్లూరులో భారీగా ఎండలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో అధికారులు ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని తెలిపారు.
Follow Us