/rtv/media/media_files/2026/05/26/rtc-driver-2026-05-26-21-23-42.jpg)
RTC Driver
RTC Driver : జగిత్యాల జిల్లా కేంద్రంలో అధికార పార్టీ నిరసన కార్యక్రమంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోమవారం నిర్వహించిన ధర్నాలో.. ప్రజా సమస్యలపై గళమెత్తిన ఒక ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్‌పై అధికారులు వేటు వేయడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్ నాయకుల కంప్లైంట్ ఆధారంగా జగిత్యాల ఆర్టీసీ డ్రైవర్ ఉద్యోగం తొలగింపు
— Telangana First (@TelanganaFirst_) May 26, 2026
ముందు వడ్లు కొనండి అని చెప్పినందుకు ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌ను విధుల నుండి తొలగిస్తూ రిమూవల్ లెటర్ జారీ చేసిన జగిత్యాల ఆర్టీసీ రీజినల్ మేనేజర్
అశోక్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కించపరుస్తూ మాట్లాడాడని… https://t.co/HzZOKXjbY1pic.twitter.com/jzTSSCKiNA
అసలేం జరిగిందంటే?
జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్ అశోక్.. సోమవారం ధర్నా జరుగుతున్న సమయానికి అదే రూట్‌లో బస్సు నడుపుకుంటూ వెళ్లాడు. అక్కడ జరుగుతున్న నిరసనను చూసి స్పందించిన ఆయన, “ముందు రైతుల వడ్లు, మక్కల (మొక్కజొన్న) కొనుగోళ్ల గురించి పట్టించుకోండి. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై ఆ తర్వాత మాట్లాడొచ్చు” అంటూ బహిరంగంగా కామెంట్స్ చేశాడు. మంత్రి, ఎమ్మెల్యేల ముందే డ్రైవర్ ఈ వ్యాఖ్యలు చేయడం అక్కడ ఉన్నవారిని ఆశ్చర్యపరిచింది.
ప్రజాస్వామ్యం గురించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద లెక్చర్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ … అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యాన్ని పాతర వేస్తున్నది.. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వడ్లు కొనాలని మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సూచించిన జగిత్యాల డిపో ఆర్టీసీ డ్రైవర్ ను విధుల… pic.twitter.com/UK3WZDgcSm
— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 26, 2026
అయితే, ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే డ్రైవర్ అశోక్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కార్యాలయం నుంచి ఆయనకు 'రిమూవల్ లెటర్' (విధుల నుంచి తొలగింపు ఉత్తర్వులు) జారీ అయినట్లు విశ్వసనీయ సమాచారం. ఇకపై డ్యూటీకి రావద్దని అధికారులు ఆయనకు సూచించినట్లు తెలిసింది.ఈ పరిణామంపై డ్రైవర్ అశోక్ స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ఏ రాజకీయ పార్టీని గానీ, ఏ ఒక్క నాయకుడిని గానీ వ్యక్తిగతంగా విమర్శించలేదని స్పష్టం చేశాడు. ఒక సాధారణ పౌరుడిగా, రైతుల పక్షాన నిలబడి వారి కష్టాల గురించే మాట్లాడానని.. కేవలం అన్నదాతల సమస్యలపై స్పందించినందుకే తనను ఉద్యోగంలో నుంచి తీసేయడం ఎంతవరకు న్యాయమని ఆయన ప్రశ్నించాడు.
జగిత్యాలలో సస్పెండ్ చేసిన ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆర్టీసీ రీజినల్ మేనేజర్‌కు వినతి పత్రం అందజేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే @GangulaBRS, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ జీవన్ రెడ్డి మరియు ఇతర బీఆర్ఎస్ నాయకులు pic.twitter.com/kus1ce2WnT
— BRS Party (@BRSparty) May 26, 2026
జగిత్యాల నియోజకవర్గానికి చెందిన ఒక ముఖ్య కాంగ్రెస్ నాయకుడి ప్రోద్బలంతోనే అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చి, డ్రైవర్‌ను తొలగించారనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో జోరందుకుంది. హైర్ బస్ ఓనర్ అసోసియేషన్‌లో సదరు కీలక నేతకు అత్యంత సన్నిహితుడైన ఒక వ్యక్తి ఈ వ్యవహారంలో చక్రం తిప్పినట్లు సమాచారం అందుతోంది.
జగిత్యాల లో రైతుల పక్షాన ప్రశ్నించిన అశోక్ అనే డ్రైవర్ ని తొలగించారని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం..
— Ponnam Prabhakar (@Ponnam_INC) May 26, 2026
అతను కేవలం ఆర్టీసీ హైర్ (కిరాయి)బస్సు డ్రైవర్.. ఆర్టీసీ ఉద్యోగి కాదు.
అయినప్పటికే అతన్ని ఉద్యోగం నుండి తొలగించవద్దని బస్సు యాజమాన్యానికి సూచించాం,
అశోక్ రైతుల పక్షాన… pic.twitter.com/frYRlVzbQ2
మంత్రి పొన్నం ప్రభాకర్ వివరణ
జగిత్యాలలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నాలో.. రైతుల సమస్యలపై మాట్లాడినందుకు ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌ను ఉద్యోగం నుంచి తొలగించారంటూ వస్తున్న వార్తలపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టతనిచ్చారు. ఈ ప్రచారమంతా పూర్తిగా అవాస్తవమని ఆయన కొట్టిపారేశారు. మంగళవారం సాయంత్రం తన అధికారిక 'ఎక్స్' (ట్విట్టర్) హ్యాండిల్‌లో ఒక వీడియోను పోస్ట్ చేసిన మంత్రి, ఈ వివాదానికి తెరదించారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. డ్రైవర్ అశోక్ ఆర్టీసీ ప్రభుత్వ ఉద్యోగి కాదని, ఆయన ఒక ప్రైవేట్ అద్దె బస్సు (హైర్ బస్) డ్రైవర్ అని స్పష్టం చేశారు. అశోక్‌ను విధుల్లోంచి అస్సలు తప్పించవద్దని సదరు అద్దె బస్సు యజమానికి తామే స్వయంగా సూచించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ చిన్న విషయాన్ని కొందరు కావాలనే రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. డ్రైవర్ అశోక్ రైతుల పక్షాన మాట్లాడారని, ఒక పౌరుడిగా ఆయన అన్న మాటలను తాము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా పేర్కొనడం విశేషం.
"అశోక్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం బస్సు యజమానికి చెప్పలేదు. ఇప్పుడే నేను ఆర్టీసీ ఎండీ (MD) తో కూడా మాట్లాడాను. డ్రైవర్ అశోక్ ఎప్పటిలాగే సదరు అద్దె బస్సులో తన విధులను నిర్వర్తించుకునే పూర్తి అవకాశం ఉంది." అని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
Follow Us