/rtv/media/media_files/2026/05/27/fotojet-2026-05-27-07-19-48.jpg)
ప్రస్తుతం పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ఓ వైపు శాంతి చర్చలకు సిద్ధం అవుతుండగా.. మరోవైపు అమెరికా, ఇరాన్ మధ్య సైనిక ఘర్షణలు మళ్లీ మొదలయ్యాయి. అగ్రరాజ్యం అమెరికా ఇరాన్‌పై భారీ స్థాయిలో దాడులకు పాల్పడింది. ఇరాన్‌కు చెందిన క్షిపణి ప్రయోగ కేంద్రాలు, నౌకలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసింది. అయితే ఇరాన్ దళాల నుంచి తమ దేశానికి ముప్పు పొంచి ఉందని, ముఖ్యంగా అమెరికాకు చెందిన రెండు విమాన వాహక నౌకలు, భారీ యుద్ధ నౌకల భద్రత దృష్ట్యా ఈ ముందస్తు దాడులు చేసినట్లు సెంట్రల్ కమాండ్ కెప్టెన్ టిమ్ హాకిన్స్ తెలిపారు. ఈ దాడుల్లో బందర్ అబ్బాస్ నౌకాశ్రయం ధ్వంసం కావడంతో పాటు లర్క్ ద్వీపంలో నలుగురు ఇరాన్ సైనికులు కూడా మరణించినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: Prabhas Spirit: ప్రభాస్ తో తృప్తి డిమ్రి యాక్షన్ షురూ.. ‘స్పిరిట్’ షూటింగ్ ‘స్పెషల్’ అప్డేట్!
🚨Breaking: Israeli and U.S. aircraft are continuously bombing Iran, while Tehran and its allied groups are launching retaliatory attacks. pic.twitter.com/j2p1dcTaVX
— Voice Of Tehran (@Tehran_Reports) May 27, 2026
ఇది కూడా చూడండి: Tamil Nadu : తమిళనాడులో STF చీఫ్ గా 'లేడీ సింగం'భవానీశ్వరి? ఇంతకు ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా?
12 మంది మృతి..
ఇదే సమయంలో ఇజ్రాయెల్ కూడా ఇరాన్ మద్దతు ఉన్న హెజ్‌బొల్లా మిలిటెంట్ గ్రూపుపై వైమానిక దాడులు చేసింది. ముఖ్యంగా లెబనాన్‌లోని టైర్ నగరంపై జరిపిన దాడుల్లో కనీసం 12 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు హెజ్‌బొల్లా కూడా ఇజ్రాయెల్ దళాలపై ప్రతిదాడి చేసినట్లు ప్రకటించింది. వచ్చే మూడు రోజుల్లో వాషింగ్టన్‌లో లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య ప్రత్యక్ష చర్చలు జరగాల్సి ఉంది. కానీ మళ్లీ ఘర్షణలు మొదలు కావడంతో పరిస్థితులు కఠినంగా మారాయి.
🚨 BREAKING : WAR HAS BEGUN 💥
— USmilitary🎖 (@Usmilitryy) May 26, 2026
The United States has launched airstrikes on Iranian cities, reportedly firing 10 missiles so far. pic.twitter.com/G7ICbHOyQz
అమెరికా దాడులను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. చర్చల ప్రక్రియ సాగుతున్న సమయంలో ఇలాంటి దాడులకు దిగడం అమెరికా ద్వంద్వ ప్రమాణాలకు, వంచనకు నిదర్శనమని టెహ్రాన్ మండిపడింది. ఈ దాడుల పర్యవసానాలకు అమెరికానే పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా ఇరాన్ తన యురేనియం నిల్వలను అంతర్జాతీయ పర్యవేక్షణలో ధ్వంసం చేయడానికి లేదా అప్పగించడానికి సిద్ధమైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే దాడులు కొనసాగుతున్న సమయంలో అమెరికాకు చెందిన ఎంక్యూ-9 రీపర్ డ్రోన్‌ను కూల్చివేసినట్లు ఇరాన్ వెల్లడించింది.
ఇది కూడా చూడండి: RTC Driver : ‘ముందు వడ్లు కొనండి సార్’.. అన్న RTC డ్రైవర్‌కు ఊహించని షాక్...అదేం లేదన్న మంత్రి పొన్నం...
Follow Us