Vijaysai Reddy: రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా
రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్‌కు తన రాజీనామా లేఖను విజయసాయి రెడ్డి అందించారు. స్పీకర్ ఫార్మాట్లో ధన్‌ఖడ్‌కు రాజీనామ లేఖ ఇచ్చారు.
రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్‌కు తన రాజీనామా లేఖను విజయసాయి రెడ్డి అందించారు. స్పీకర్ ఫార్మాట్లో ధన్‌ఖడ్‌కు రాజీనామ లేఖ ఇచ్చారు.
గంజాయి వ్యాపారంలో స్మగ్లర్లు ఆరితేరారు. తమిళనాడుకు చెందిన కియా కారుకు ప్రముఖ తెలుగు మీడియా స్టిక్కర్, ఏపీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ అతికించి తరలిస్తుండగా నర్సీపట్నం వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఈ కారులో నాలుగుసార్లు రవాణా చేసినట్లు గుర్తించారు.
వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. శనివారం తన రాజ్యసభ సభ్యత్వానికి సైతం రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు 'X' లో పోస్ట్ చేశారు విజయసాయి.
ఏపీలో నకిలీ సిగరేట్ల వ్యాపారం కలకలం రేపుతోంది. గుంటూరులోని జిందాల్ వేస్ట్ ఎనర్జీ మేనేజ్మెంట్ కంపెనీలో 6టన్నుల ఫేక్ సిగరేట్స్, 2 టన్నుల గంజాయి, 10 టన్ను చైనీస్ గార్లిక్‌ను కస్టమ్స్ అధికారులు గుర్తించారు. స్మగ్లర్లను వైజాగ్ కోర్టులో ప్రవేశపెట్టారు.
అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలో మరోసారి అగ్ని ప్రమాదం జరిగింది. మెట్రో కెన్ ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు అలుముకోవడంతో కార్మికులు,స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
విశాఖపట్నం జిల్లా ఆనందపురంలో లంకె బిందెలకు పూజ చేస్తానని చెప్పి.. రూ.28 లక్షలు కాజేశాలని చూశాడు. బాధితుల పిర్యాదుతో దొంగ బాబాతో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేశారు. నిందితుల నుంచి లక్షా 75వేలు నగదు, 7 ఫోన్లు, కారు, రాగి బిందెలు స్వాధీనం చేసుకున్నారు.
సంక్రాంతి కి సొంతూర్లకు వెళ్లి తిరిగి పయనమైన వారికి సౌత్ సెంట్రల్ రైల్వే ఓ తీపి కబురు చెప్పింది. తిరుగు ప్రయాణికుల కోసం 8 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించారు. జనవరి 18 నుంచి 20 తేదీలలో ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి.
ఏపీకి కొత్త బీజేపీ చీఫ్ ను నియమించేందుకు కమలం పార్టీ కసరత్తు చేస్తోంది. కడప నుంచి రామచంద్రారెడ్డి, విశాఖ నుంచి మాజీ ఎమ్మెల్సీ మాధవ్, నెల్లూరు నుంచి ఇసక సునీల్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా ఎంపిక పూర్తి అయ్యే అవకాశం ఉంది.
టీమిండియా యంగ్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి తక్కువ కాలంలోనే తన టాలెంట్‌తో గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే వైజాగ్‌కి చెందిన నితీష్ తాజాగా సీఎం చంద్రబాబు, లోకేష్‌ను కలిశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.