/rtv/media/media_files/2025/01/24/SUFOQYjcRdF4Y1Neh1dp.jpg)
ganja Photograph: (ganja )
Ganja: గంజాయి రవాణాపై పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ గంజాయి స్మగ్లర్లు కొత్త పద్ధతిలో దందా నడిపిస్తున్నారు. ఈసారి ఏకంగా మీడియా వెహికిల్ ముసుగులో రవాణా మొదలుపెట్టారు. కేరళకు చెందిన ఇద్దరు వ్యక్తులు వరుసగా నాలుగు సార్లు మీడియా ముసుగులో ప్లాన్ వర్కౌట్ చేశారు. అయితే ఐదోసారి మాత్రం ప్లాన్ బెడిసి కొట్టడంతో పోలీసులకు అడ్డంగా బుక్ అయ్యారు.
10 రోజులు పాటు బుక్ చేసుకుని..
ఈ మేరకు తమిళనాడు రిజిస్ట్రేషన్ కలిగిన కియా కారుపై ప్రముఖ మీడియా సంస్థ లోగోను అద్దాలపై అతికించారు. కార్లు అద్దెకి ఇచ్చే టూరిస్ట్ యాప్‌లో తమిళనాడు రిజిస్ట్రేషన్ కలిగిన కారును 10 రోజులు పాటు బుక్ చేసుకుని దానికి ఏపీ రిజిస్ట్రేషన్ నెంబర్ బోర్డును అతికించారు. అల్లూరి జిల్లా అంబేరుపాడు గ్రామానికి చెందిన వ్యక్తులతో కలిసి ఒరిస్సా పరిసర ప్రాంతాలలో 10 లక్షలు విలువ చేసే 205 కేజీలు గంజాయి కొనుగోలు చేశారు. అనతరం అల్లూరు జిల్లా మీదుగా నర్సీపట్నం వైపు వెళ్తున్నారు.
ఇది కూడా చదవండి: ICC AWARDS 2024: టెస్టుల్లో ఈ ఇద్దరికే.. వన్డేల్లో ఒక్కరు లేరు!
అయితే కారు నర్సీపట్నం శివారు నెల్లిమెట్ట గ్రామానికి చేరుకోగానే పోలీసులను చూసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులను, మోటార్ బైక్ పై ప్రయాణిస్తున్న మరో వ్యక్తిని పట్టుకున్నారు. గంజాయి ప్యాకెట్లతో నిండిన కియా కార్‌తో పాటు ఒక మోటార్ బైక్ సెల్ ఫోన్ 1500 డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లను స్టేషన్ కు తరలించగా ఈ ఆపరేషన్ లో పాల్గొన్న పోలీసులను అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా అభినందించారు.