/rtv/media/media_files/2025/01/24/0PJisgX2b06xJvLQYKwe.jpg)
YCP MP Vijayasai reddy
YCP MP Vijayasai Reddy: రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాలనుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. శనివారం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని తెలిపారు. తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరనని ఆయన స్పష్టం చేశారు. ఇది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమని తెలిపారు. నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వై యస్ కుటుంబానికి రుణపడి ఉంటానన్నారు. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ కు, ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్ళిన భారతమ్మకు సదా కృతజ్ఞుడినన్నారు.
ఇది కూడా చదవండి: Benami Shock For a Politician : రాజకీయనాయకుడికి బినామీ ఝలక్...వెయ్యికోట్లతో పరారీ...
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను.
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 24, 2025
రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నాను.
ఏ రాజకీయపార్టీ లోను చేరడంలేదు. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేరడంలేదు.
ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తి గతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరూ ప్రభావితం చెయ్యలేదు.…
Also Read : భలే ఛాన్స్ మిస్.. విశ్వనాథ్ బ్లాక్ బస్టర్ సినిమాను రిజెక్ట్ చేసిన హీరోయిన్!
కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య వారధిలా పని చేశా..
పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశానననారు. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశానన్నారు. దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్నిచ్చి తెలుగురాష్ట్రాల్లో తనకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోదీకి, హోం మంత్రి అమిత్ షాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
చంద్రబాబుతో వ్యక్తిగత విభేదాలు లేవు..
టీడీపీతో రాజకీయంగా విభేదించానని.. అంతే కానీ చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవన్నారు. పవన్ కళ్యాణ్ తో చిరకాల స్నేహం ఉందన్నారు. తన భవిష్యత్ ఇక వ్యవసాయమేనన్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన రాష్ట్ర ప్రజలకు, మిత్రులకు, సహచరులకు, పార్టీ కార్యకర్తలకు పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఇది కూడా చదవండి: భారతీయులకు ట్రంప్ బిగ్ షాక్!
వైఎస్ ఫ్యామిలీకి ఆడిటర్ నుంచి వైసీపీలో నంబర్ 2 దాకా..
ఛార్టర్డ్ అకౌంటెంట్ చేసిన విజయసాయిరెడ్డి, వైఎస్ ఫ్యామిలీకి ఆడిటర్ గా పని చేశారు. జగన్ పై కేసులు నమోదైన సమయంలో ఆయనతో పాటు జైలుకు కూడా వెళ్లాడు. అనంతరం బయటకు వచ్చిన తర్వాత యాక్టీవ్ గా పని చేశారు. పార్టీ పెట్టిన మొదట్లో జగన్ తర్వాత విజయసాయిరెడ్డే అన్నట్లుగా నడిచింది. ఈ నేపథ్యంలో జగన్ విజయసాయికి రెండు సార్లు రాజ్యసభకు వెళ్లే అవకాశం ఇచ్చారు. గత ఎన్నికల సమయంలో నెల్లూరు ఉంచి విజయసాయిరెడ్డిని ఎంపీగా బరిలోకి దించారు జగన్. అయితే.. ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. విజయసాయిరెడ్డికి బీజేపీతో సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీలో చేరే అవకాశం లేకపోలేదన్న చర్చ కూడా సాగుతోంది. మరికొన్ని రోజుల్లో ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.