Vijaysai Reddy: రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తాజాగా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్‌కు అందించారు. ఈ నేపథ్యంలో ఆయన సోషల్ మీడియాలో మరోసారి సంచలన పోస్ట్ పెట్టారు. దేశంలో నివసిస్తున్న అక్రమ వలసదారులను గుర్తించి వారి దేశానికి పంపివేయాలని అన్నారు. చాలా మంది వ్యక్తులు మారిన పేర్లతో జీవిస్తున్నారని పేర్కొన్నారు. అందులో కొందరు నేరాలకు పాల్పడుతున్నారన్నారు. ఈ మేరకు ట్విట్టర్ ‘ఎక్స్’ వేదికగా ఒక పోస్టు పెట్టారు.
ఇది కూడా చదవండి: సూపర్ సెల్ తుఫాన్‌తో బ్రెజిల్ అతలాకుతలం.. వీడియో వైరల్!
సంచలన పోస్టు
देश में रह रहे अवैध प्रवासी न केवल सुरक्षा के लिए बड़ा खतरा बन चुके हैं, बल्कि सामाजिक ताने-बाने को भी नुकसान पहुंचा रहे हैं। कई लोग बदले हुए नामों से रह रहे हैं, तो कुछ अपराधों और राष्ट्रविरोधी गतिविधियों में लिप्त हैं। यह स्थिति देश की शांति और सुरक्षा के लिए गंभीर चुनौती है।…
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 25, 2025
‘‘దేశంలో నివసిస్తున్న అక్రమ వలసదారులు భద్రతకు పెద్ద ముప్పుగా మారడమే కాకుండా సామాజిక స్వరూపాన్ని కూడా దెబ్బతీస్తున్నారు. చాలా మంది వ్యక్తులు మారిన పేర్లతో జీవిస్తున్నారు. కొందరు నేరాలు, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఈ పరిస్థితి దేశ శాంతి భద్రతలకు పెను సవాలు. అటువంటి అక్రమ వలసదారులందరినీ గుర్తించి వీలైనంత త్వరగా వారి దేశానికి తిరిగి పంపించేందుకు ప్రచారాన్ని ప్రారంభించాలని నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. దేశప్రజల భద్రత, జాతీయ ప్రయోజనాల విషయంలో రాజీపడకూడదు’’ అని రాసుకొచ్చారు.
కాగా విజయసాయి రెడ్డి నిన్న (శుక్రవారం) చెప్పినట్లుగానే.. నేడు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్‌లో ధన్‌ఖడ్‌కు తన రాజీనామ లేఖ ఇచ్చారు. తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరనని స్పష్టం చేశారు. ఇది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమని తెలిపారు.
ఇది కూడా చదవండి: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ షాక్.. ఇప్పట్లో లేనట్లే!
జగన్‌కి మంచి జరగాలి
నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా తనను నమ్మి ఆదరించిన వైయస్ కుటుంబానికి రుణపడి ఉంటానన్నారు. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్(YS Jagan) కు, ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిన భారతమ్మకు సదా కృతజ్ఞుడినన్నారు. జగన్‌కి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: అమెరికాలోనే చరిత్రలోనే అతి పెద్ద ఏరివేత..వైట్ హౌస్
పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో(Rajya Sabha) ఫ్లోర్ లీడర్ గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశానన్నారు. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశానని చెప్పుకొచ్చారు. దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్నిచ్చి తెలుగురాష్ట్రాల్లో తనకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీకి(PM Modi), హోం మంత్రి అమిత్ షాకి(Amith Shah) ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఇది కూడా చదవండి: మేడ్చల్ యువతి హత్య కేసులో వెలుగులోకి కీలక విషయాలు..
టీడీపీతో(TDP) రాజకీయంగా విభేదించానని.. చంద్రబాబు(Chandrababu) కుటుంబంతో వ్యక్తి గతంగా ఎలాంటి విభేదాలు లేవని అన్నారు. పవన్ కళ్యాణ్(Pawan Kalyan)తో చిరకాల స్నేహం ఉందన్నారు. తన భవిష్యత్తు ఇక వ్యవసాయమే అని చెప్పుకొచ్చారు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహచరులకి, పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.