ఏపీ బీజేపీకి కొత్త చీఫ్ ను నియమించేందుకు ఆ పార్టీ చీఫ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరిని తప్పించి కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని డిసైడ్ అయినట్లు సమాచారం. గత పార్లమెంట్ ఎన్నికల్లో పురంధేశ్వరి రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో కొత్త వారికి అవకాశం ఇచ్చేందుకు బీజేపీ సిద్ధం అవుతోంది. కడప నుంచి రామచంద్రారెడ్డి, విశాఖ నుంచి మాజీ ఎమ్మెల్సీ మాధవ్, నెల్లూరు నుంచి ఇసక సునీల్ ఎంపిక కొత్త బీజేపీ చీఫ్ పదవికి పోటీ పడుతున్నట్లు చర్చ సాగుతోంది. వీరిలో ఒకరిని ఎంపిక చేయడానికి పార్టీ పెద్దలు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెలాఖరుకు కొత్త బీజేపీ చీఫ్ ను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వార్గాలు చెబుతున్నాయి.
AP BJP: పురంధేశ్వరికి బిగ్ షాక్.. ఏపీ బీజేపీకి కొత్త చీఫ్ ఎవరంటే?
ఏపీకి కొత్త బీజేపీ చీఫ్ ను నియమించేందుకు కమలం పార్టీ కసరత్తు చేస్తోంది. కడప నుంచి రామచంద్రారెడ్డి, విశాఖ నుంచి మాజీ ఎమ్మెల్సీ మాధవ్, నెల్లూరు నుంచి ఇసక సునీల్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా ఎంపిక పూర్తి అయ్యే అవకాశం ఉంది.
New Update
తాజా కథనాలు