/rtv/media/media_files/2025/01/21/wAnl7aYubTsjSwbLHqun.jpg)
parawada
ఏపీ అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీ (Parawada Pharma City) లో అగ్ని ప్రమాదం జరిగింది. మెట్రో కెన్ ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు అలుముకోవడంతో కార్మికులు,స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
Also Read: Supreme Court: గోధుమ పిండి, వాటర్ బాటిళ్లకు హలాల్ సర్టిఫికేట్ అవసరమా..?
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు . ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
పరవాడ ఫార్మాసిటీలో మరో అగ్ని ప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు
— RTV (@RTVnewsnetwork) January 21, 2025
అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారు జామున మెట్రో కెమ్ ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టంగా పొగ అలుముకోవడంతో కార్మికులు, చుట్టు పక్కల నివాసమున్న ప్రజలు… pic.twitter.com/FAU92ZmcHk
Also Read: ఇంట్లో వాళ్లతో ఫైట్ చేసి... ప్రియురాలితో పెళ్లి కోసం ముస్లిం నుంచి హిందూమతంలోకి
వరుస అగ్ని ప్రమాదాల...
పరవాడ ఫార్మాసిటీలో జరుగుతున్న వరుస అగ్ని ప్రమాదాల (Fire Accidents) గురించి కార్మికులు,స్థానికులు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవలే 2024 నవంబర్ 2, డిసెంబర్ 22 తేదీల్లో భారీ అగ్ని ప్రమాదాలే జరిగిన విషయం తెలిసిందే. మళ్లీ నెల రోజులు కూడా గడవకుండానే మరో అగ్ని ప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తుంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
Also Read: Kolkata: సంజయ్ రాయ్ శిక్షపై మమతా సర్కార్ అసంతృప్తి..కీలక నిర్ణయం
Also Read: Attack on Dalits: దారుణం.. పనికి రానందుకు ముగ్గురు దళితులపై విచక్షణారహితంగా దాడి..