Fake cigarettes: ఈ సిగరేట్ తాగారో మీకు చావు డప్పే.. ఏపీలో నకిలీ సిగరేట్ల కలకలం!

ఏపీలో నకిలీ సిగరేట్ల వ్యాపారం కలకలం రేపుతోంది. గుంటూరులోని జిందాల్ వేస్ట్ ఎనర్జీ మేనేజ్మెంట్ కంపెనీలో 6టన్నుల ఫేక్ సిగరేట్స్, 2 టన్నుల గంజాయి, 10 టన్ను చైనీస్ గార్లిక్‌ను కస్టమ్స్ అధికారులు గుర్తించారు. స్మగ్లర్లను వైజాగ్ కోర్టులో ప్రవేశపెట్టారు. 

New Update
ap ganja case

ap ganja case Photograph: (ap ganja case)

Fake cigarettes: ఏపీలో నకిలీ సిగరేట్ల కట్టలు కలకలం రేపుతున్నాయి. అంతేకాదు ఈ ఫేక్ సిగరేట్లలో వాడేందుకు ఉపయోగిస్తున్న 2 టన్నుల గంజాయి, 10 టన్నుల చైనీస్ గార్లిక్ సైతం పట్టుబడటం సంచలనం రేపుతోంది. వీటిని కిరాణా షాపులు, పాన్ డబ్బాల్లో స్పెషల్ రేట్లకు అమ్ముతున్నట్లు గుర్తించిన అధికారులు దాడులు చేయడంతో భయంకరమైన గుట్టు రట్టైంది. 

3 కోట్ల విలువైన 2 టన్నుల గంజాయి..

ఈ మేరకు వివరాల్లోకి వెళితే.. గుంటూరులోని జిందాల్ వేస్ట్ ఎనర్జీ మేనేజ్మెంట్ కంపెనీలో భారీగా నకిలీ సిగరెట్లు, గంజాయి, 10 టన్నుల చైనీస్ గార్లిక్‌ను ధ్వంసం చేసినట్లు కస్టమ్స్ అధికారి నరసింహారెడ్డి తెలిపారు. సెంట్రల్ జీఎస్టి, కస్టమ్స్ అధికారులు చేపట్టిన ఆపరేషన్ లో 9 కోట్ల విలువైన నకిలీ సిగరెట్లను ధ్వంసం చేసినట్లు చెప్పారు. అలాగే ఇందులో వాడేందుకు వినియోగిస్తున్న 3 కోట్ల విలువైన 2 టన్నుల గంజాయిని కూడా గుర్తించి కాల్చివేసినట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురు స్పాట్

'ఫేక్ సిగరెట్లు ఇల్లీగల్ గా వచ్చే ఇంటర్నేషనల్ సిగరెట్లపైన ప్రత్యేక దృష్టి పెట్టాం. నేపాల్, కోల్‌కతా సరిహద్దు నుంచి అక్రమంగా మనదేశంలోకి తీసుకువచ్చిన10టన్నుల చైనీస్ గార్లిక్ పట్టుకున్నాం. గంజయా ప్యాకెట్స్ ను గుర్తించాం. వీటిని సరాఫరా చేస్తున్న స్మగ్లర్లను అరెస్టు చేసి వైజాగ్ కోర్టులో ప్రవేశపెట్టాం' అని పోలీసులు తెలిపారు. 

ఇది కూడా చదవండి: BRS MLA Kaushik Reddy: ఈటల సొంతూరిలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి అవమానం!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Court Movie : తిరుపతిలో కోర్టు మూవీ లాగే....ఏం జరిగిందంటే...

ఏపీలోని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురంలో కోర్టు సినిమా తరహ ఘటన సంచలనం రేకెత్తిస్తోంది. అజయ్ అనే యువకుడు 17 ఏళ్ల మైనర్ నిఖిత గడచిన మూడేళ్లుగా వీరిద్ధరూ ప్రేమించుకుంటున్నారు. శుక్రవారం నిఖిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనంగా మారింది.

New Update
Court Movie

Court Movie

Court Movie: ఏపీలోని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురంలో అచ్చం కోర్టు సినిమా తరహ ఘటన సంచలనం రేకెత్తిస్తోంది. ఈ ఘటన తెలిసిన వారంతా ‘కోర్టు’ సినిమాను పోలి ఉందంటూ చర్చించుకుంటున్నారు. అసలు విషయానికొస్తే మిట్టపాళెం ఎస్సీ కాలనీకి చెందిన అజయ్ అనే యువకుడిని 17 ఏళ్ల మైనర్ బాలిక నిఖిత ప్రేమించింది. గడచిన మూడేళ్లుగా వీరిద్ధరూ ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం నిఖిత కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో గత ఏడాది ఇద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. అయితే కులాలు వేరు కావడంతో పాటు నిఖిత మైనర్ కావడంతో అజయ్‌తో నిఖిత ప్రేమ కుటుంబ పరువును దెబ్బతీస్తుందని భావించిన ఆమె తల్లిదండ్రులు ఈ ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత తల్లిదండ్రలు ఆమెను ఇంటికి తీసుకొచ్చారు.నిఖిత మైనర్ కావడంతో, గత ఏడాది ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అజయ్‌పై పోలీసులు ఫోక్సో (POCSO) కేసు నమోదు చేసి, అతడిని జైలుకు పంపారు. 

Also Read: ట్రంప్ టారిఫ్‌లు వేస్తే మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు.. రాహుల్‌గాంధీ ఫైర్

ఈ క్రమంలోనే నిఖిత గర్భం దాల్చింది. దీంతో ఆమె తల్లి సుజాత కడుపులోని బిడ్డను చంపి, నిఖితను ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం. ఆ తర్వాత నాలుగు నెలల పాటు జైల్లో ఉన్న అజయ్‌ను నిఖిత పలుమార్లు కలుస్తూ వచ్చింది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో, నిఖిత తల్లిదండ్రులు సుజాత, కిషోర్ ఆమెను వేధింపులకు గురి చేస్తూ వచ్చారని అజయ్ చెప్తున్నాడు. శుక్రవారం నిఖిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో, కేవలం గంటల వ్యవధిలోనే ఆమె మృతదేహాన్ని తల్లిదండ్రులు దహనం చేశారు. “ఇద్దరం కలిసి బతకాలని ఎన్నో కలలు కన్నాం. కానీ, ఇప్పుడు ఏదీ లేకుండా చేశారు,” అని అతడు కన్నీటితో వాపోయాడు. ప్రేమించిన 17 ఏళ్ల మైనర్ బాలిక నిఖిత మరణం పలు అనుమానాలకు తావిచ్చింది.  ఈ విషయం గ్రామస్తుల దృష్టికి రావడంతో, వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో నిఖిత తల్లిదండ్రులు సుజాత మరియు కిషోర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

Also Read: రేవ్ పార్టీలో అడ్డంగా బుక్కైన ఆర్మీ, రాజకీయ నేతల కూతుర్లు.. వీడియో వైరల్ 

అజయ్, నిఖిత మరణంపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశాడు. “ఇంట్లో చంపాలని చూస్తున్నారని నాకు మెసేజ్‌లు పంపింది. ఆమె మృతిపై నాకు చాలా అనుమానాలు ఉన్నాయి,” అని అతడు చెప్పాడు. నిఖిత తల్లిదండ్రులు ఆమెను చాలాసార్లు కొట్టారని, పరువు కోసం ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని అతడు ఆరోపించాడు. నిఖిత మృతదేహాన్ని వేగంగా దహనం చేయడం, ఆమె మరణానికి ముందు అజయ్‌కు పంపిన సందేశాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పోలీసులు ఈ కేసును లోతుగా విచారిస్తున్నారు. గ్రామస్తుల సమాచారం, అజయ్ ఇచ్చిన వివరాల ఆధారంగా ఈ ఘటనలో పరువు హత్య అనుమానం బలంగా కనిపిస్తోంది. అయితే, ఖచ్చితమైన నిర్ధారణకు పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన తిరుపతి జిల్లాలోనే కాక, రాష్ట్రవ్యాప్తంగా పరువు హత్యలపై మరోసారి చర్చకు దారితీసింది. ప్రేమ వివాహాలు, కులాంతర సంబంధాలను సమాజం ఇంకా ఎంతవరకు జీర్ణించుకోలేకపోతోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిఖిత మరణం వెనుక దాగిన నిజం ఏమిటనేది పోలీసు దర్యాప్తు తేల్చనుంది..

Also read: వాళ్లను తరిమికొట్టినట్లే.. బీజేపీ వాళ్లను ఓడించాలి : సీఎం రేవంత్ రెడ్డి

Advertisment
Advertisment
Advertisment