ఆంధ్రప్రదేశ్ AP: వైసీపీ నాయకుల్లారా కళ్ళు ఉంటే ఇలా చూడండి.. ఎమ్మెల్యే కోటంరెడ్డి సెన్షేషనల్ కామెంట్స్..! రాష్ట్రమంతటా రేపు ఉదయం పండగ వాతావరణంలో పెన్షన్ ల పంపిణి కార్యక్రమం జరుగుతుందన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న సందర్భంగా చంద్రబాబు ఫొటోకు పాలాభిషేకం చేశారు. జగన్ రాష్ట్రాన్ని దివాళాతీయిస్తే చంద్రబాబు రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నారన్నారు. By Jyoshna Sappogula 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Adala Prabhakara Reddy: వైసీపీ కీలక నేతకు ఏపీ సర్కార్ బిగ్ షాక్ AP: వైసీపీ కీలక నేతకు ఏపీ సర్కార్ భారీ షాక్ ఇచ్చింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డికి ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లుల నిలివేసింది. రూ.67 కోట్ల బిల్లులను నిలిపివేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. By V.J Reddy 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ - నెల్లూరు సబ్ జైలుకు తరలింపు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు ఈవీఎం ధ్వంసంతో పాటు, అల్లర్ల కేసులో అరెస్టు అయిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను నెల్లూరు సబ్‌జైలుకు తరలించారు. By Manogna alamuru 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే.. నష్టపరిహారం అందిస్తామని హామీ..! ఉమ్మడి నెల్లూరు జిల్లా పాలకొండ సత్రంలో పిచ్చికుక్క దాడిలో గాయపడ్డ బాధితులను ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పరామర్శించారు. బాధితులకు ప్రభుత్వ డాక్టర్లు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. గ్రామంలో ఉన్న కుక్కలకు రాబిస్ వ్యాక్సిన్ వేయించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. By Jyoshna Sappogula 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP Scandal: నెల్లూర్- చైనా.. వైసీపీ హయంలో భారీ కుంభకోణం! నెల్లూరు జిల్లా సర్వేపల్లి, వెంకటగిరీ నియోజకవర్గాల కేంద్రంగా రూ.5వేల కోట్ల విలువైన వైట్ క్వార్ట్జ్ మాఫియా జరిగినట్లు ఆధారాలు బయటపడ్డాయి. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్ కారుమూరి, అల్లుడు దిలీప్ కుమార్ లు ప్రధాన సూత్రధారులుగా తెలుస్తోంది. By srinivas 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: 20 మంది విద్యార్థులకు అస్వస్థత.. ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్..! నెల్లూరు జిల్లా చెన్నూరులో గిరిజన గురుకుల పాఠశాలను ఇంచార్జ్ కలెక్టర్ ధ్యాన్ చంద్ ఆకస్మిక తనిఖీ చేశారు. కలుషిత నీరు త్రాగి అస్వస్థతకు గురైన 20 మంది విద్యార్థులను పరిశీలించారు. సమస్య పరిష్కారం అయ్యేవరకు త్రాగునీటిని బయట నుండి తెప్పించాలని అధికారులకు సూచించారు. By Jyoshna Sappogula 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime: ఏపీలో దారుణం.. మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేసి ఏం చేశారంటే..? ఉమ్మడి నెల్లూరు జిల్లా రామలింగాపురం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలికపై ఇద్దరు యువకులు కలిసి అత్యాచారానికి పాల్పడ్డ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన నరేష్,(22) గణేష్ (23)అనే ఇద్దరు యువకులు అత్యాచారంకు పాల్పడ్డారు. By Jyoshna Sappogula 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: కుంగిన కల్వర్టు.. 8 గ్రామాలకు రాకపోకలు బంద్..! ఉమ్మడి నెల్లూరు జిల్లా వేములపాలెం, విందూరు గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై కల్వర్టు కుంగిపోయింది. ఆ మార్గం గుండా రాకపోకలు స్తంభించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కల్వర్టు కూలిపోవడంతో ఎగువ గ్రామాలైన సుమారు 8 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. By Jyoshna Sappogula 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Mango Price : రికార్డు ధర పలుకుతున్న ఉలవపాడు బంగినపల్లి మామిడి! ఏపీలోని ఉలవపాడు బంగినపల్లి మామిడికి మంచి గిరాకీ ఉంది. గతంలో ఎన్నడూ లేనంతగా తొలిసారి టన్ను ఏకంగా రూ.90 వేలు పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.కాపు తక్కువగా ఉండటం, నాణ్యమైన కాయ దిగుబడి రావడంతో ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు కొనుగోలుకు ఎగబడుతున్నారు. By Bhavana 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn