/rtv/media/media_files/2025/02/19/pDpEzyfnFfiBukQrkj7x.jpg)
minor girl Photograph: (minor girl)
ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు వ్యక్తులు పదో తరగతి బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి తల్లి పోలీసుకు ఇచ్చిన ఫిర్యాదులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులపై వెంకటగిరి పోలీస్ స్టేషన్‌లో ఫోక్సో చట్టంపై కేసు నమోదు చేశారు. 10వ తరగతి చదువుతున్న మైనర్ బాలికను ఇద్దరు వ్యక్తులు గర్భవతిని చేశారంటూ బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Also Read : సీఎం సంచలన నిర్ణయం.. అవినీతికి పాల్పడ్డ 52 మంది పోలీసులు సస్పెండ్
ఫోక్సో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. షేక్ రబ్బానీ బాధితురాలి తల్లితో గతకొంతకాలంగా వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడని తెలిసింది. బాలిక ఆరో తరగతి చదువుతున్నప్పటి నుంచి షేక్ రబ్బానీ బాలికపై కన్నేశాడు. పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు.
Also Read : Harish Rao : ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్‌రావు కు ఊరట
గత కొన్నిరోజులుగా బాలిక శరీరంలో మార్పులు గమనించిన తల్లి.. ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసింది. బాలిక గర్భం దాల్చిందని డాక్టర్లు నిర్థారించారు. దీంతో బాధితురాలి తల్లి షేక్ రబ్బానీ(38), చినబాబు అలియాస్ బాలులపై పోలీసులు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఫోక్సో చట్టం కింద FIRలో నమోదు చేశారు.