/rtv/media/media_files/2025/02/10/jnTtik6xJR7tms0C3uFq.jpg)
ycp social media shocking post next target seemaraja and kiraak rp, hyper aadi
ఎన్నికల తర్వాత కాస్తంత చల్లబడ్డ వైసీపీ సోషల్ మీడియా.. మళ్లీ యాక్టీవ్ అయిపోయింది. జగన్, వైసీపీపై రెచ్చిపోతున్న వారిపై విరుచుకుపడుతోంది. వారిపై ఉన్న వివాదాలను బయటకు తీసి నెట్టింట రచ్చ రచ్చ చేస్తోంది. ఇటీవల కిరణ్ రాయల్ వ్యవహారం, లైలా ప్రీరిలీజ్ లో పృథ్వీ రాజ్ అంశాన్ని వెంటాడడం ఇందులో భాగంగానే జరిగినట్లు స్పష్టమవుతోంది. కిరణ్ రాయల్ కు ఓ మహిళతో ఉన్న వివాదాన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడంలో వైసీపీ సోషల్ మీడియా సక్సెస్ అయ్యింది.
Also Read: వంటలో నల్ల మిరియాలు వాడితే బరువు తగ్గుతారా?
కిరణ్ రాయల్ టార్గెట్
ఇటీవల కిరణ్ రాయల్ వైసీపీ సర్కార్ పై తీవ్రంగా రెచ్చిపోతున్న విషయం తెలిసిందే. జగన్ 2.O అంశంపై రోబో 2.O ఫొటోతో ఆయన వేసిన సెటైర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన వైసీపీ కిరణ్ రాయల్ టార్గెట్ గా పని చేసింది. దీంతో కిరణ్ రాయల్ ను జనసేనకు దూరంగా ఉండాలని ఏకంగా ఆ పార్టీ అధినేత పవన్ స్వయంగా ప్రకటన విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Also Read: ఢిల్లీ ఫలితాలపై కోమటిరెడ్డి రియాక్షన్.. కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్!
విశ్వక్ ఫైర్
లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పృథ్వీ వైసీపీ 11 సీట్ల అంశాన్ని గుర్తు చేస్తూ సెటైర్లు వేశాడు. దీంతో వైసీపీ సోషల్ మీడియా తీవ్రంగా రియాక్ట్ అయ్యింది. బైకాట్ లైలా యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేసింది. ఈ యాష్ ట్యాగ్ పై ఏకంగా 86 వేల ట్వీట్లను పోస్ట్ చేసి హల్ చల్ చేసింది. దీంతో ఆ సినిమా హీరో విశ్వక్ సేన్ ప్రెస్ మీట్ పెట్టి పృథ్వి చేసిన తప్పుకు తమను బలి చేయవద్దని వేడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదే ఊపులో వైసీపీ సోషల్ మీడియా మరో సంచలన ప్రకటన విడుదల చేసింది.
YSRCP సోషల్ మీడియా 🔥... 2.O@Seemaraja_Off ⏳𝙻𝚘𝚊𝚍𝚒𝚗𝚐 ..
— 𝐇𝐚𝐫𝐬𝐡𝐚𝐘𝐬𝐫𝐜𝐩 ᴶᵃᵍᵃⁿ ᶜᵐ AP (@Harsha_YSJ) February 9, 2025
RP ⏳𝙻𝚘𝚊𝚍𝚒𝚗𝚐..
హైపర్ ఆది ⏳𝙻𝚘𝚊𝚍𝚒𝚗𝚐..@KiranRoyaljsp ✅ completed..2.O pic.twitter.com/pVIZBCR7td
Also Read: డాంకీ రూట్ లో అమెరికా వెళ్తూ..పంజాబ్ యువకుడి మృతి!
నెక్స్ట్ సీమరాజా
ఇప్పటికి కిరణ్ రాయల్ 2.0 కంప్లీట్ అని.. త్వరలో సీమరాజకు సంబంధించిన విషయాలు బయటకు రాబోతున్నట్లు హింట్ ఇస్తూ.. ''సీమరాజ లోడింగ్’’ అంటూ సోషల్ మీడియాలో వైసీపీ ఫ్యాన్స్ పోస్ట్‌లు పెడుతున్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతోంది. సీమరాజ గతంలో వైసీపీ నాయకుడిగా చెప్పుకుని ఆ పార్టీనే తిడుతూ వీడియోలలో కనిపించడంతో ఇప్పుడు ఆయనపై వైసీపీ సోషల్ మీడియా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
Also Read: బంగ్లాలో కొనసాగుతున్న ఆపరేషన్ డేవిల్ హంట్..1300 మంది అరెస్ట్!
తర్వాత కిర్రాక్ ఆర్పీ
ఇక సీమరాజా తర్వాత నెక్స్ట్ టార్గెట్ కిర్రాక్ ఆర్పీ అని సోషల్ మీడియాలో వైసీపీ పోస్టులు పెట్టడం ఆసక్తికరంగా మారింది. గతంలో ఆర్పీ సైతం జగన్‌పై ఎన్నో విమర్శలు చేశాడు. అలాగే రోజాపై కూడా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా ఆర్పీపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. అతడి తర్వాత హైపర్ ఆదిని టార్గెట్ చేయబోతున్నట్లు వైసీపీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Never Mess With YSRCP SM 🤙🔥 pic.twitter.com/XQ22s8eJIM
— 𝐑𝐚𝐠𝐮𝐥𝐮𝐭𝐮𝐧𝐧𝐚 𝐘𝐮𝐯𝐚𝐭𝐚𝐫𝐚𝐦 (@karnareddy4512) February 9, 2025
వీరు గతంలో చాలా ఈవెంట్లలో వైసీపీపై సెటైరికల్‌గా, వ్యంగ్యంగా మాట్లాడిన వీడియోలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసింది. ఇప్పుడు వారిని వైసీపీ ఫ్యాన్స్ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో వారి గురించి ఎలాంటి అంశాలను వైసీపీ సోషల్ మీడియా బయట పెడుతందనే అంశం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. మరి ఈ 2.0లో తర్వాత బయటకు వచ్చే పేరు ఎవరిదో చూడాలి.