/rtv/media/media_files/2025/02/12/PoM0LpSHord6W7LzlWBA.jpg)
AP New ration cards distributed from March first week
New Ration Cards: కొత్త రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మార్చి మొదటివారం నుంచి క్యూఆర్ కోడ్‌తో కూడిన కొత్త రేషన్ కార్డులు అందిస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పాత కార్డుల్లో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పిస్తామన్నారు. శనివారం నెల్లూరు జిల్లాలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మరో వారం రోజుల్లో అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్త రేషన్ కార్టు ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు.
3.36 లక్షల దరఖాస్తులు..
ఈ మేరకు మహిళలందరూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన దీపం-2 పథకం హామీని సీఎం చంద్రబాబు నెరవేర్చారన్నారు. నెల్లూరు జిల్లాలో 4 లక్షల ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 93.42 లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. మరో 1.50 కోట్లు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఎన్నికల సమయంలో రేషన్ కార్డులు మంజూరు చేస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించగా.. మార్పులు చేర్పులకు సంబంధించిన 3.36 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: HYD: సారీ అమ్మా, చనిపోతున్నా..ఉప్పల్ లో ఎనిమిదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య