TDP Office Attack Case : వాళ్లిద్దరూ దేశం విడిచి వెళ్లద్దని సుప్రీంకోర్టు కీలక ఆదేశం..ఎవరో తెలుసా ?

చంద్రబాబు నివాసం, టీడీపీ కార్యాలయంపై దాడి కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వైసీపీనేతలు జోగి రమేశ్‌, దేవినేని అవినాష్‌ సహా 20 మంది దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయస్థానం విచారించింది. దేవినేని అవినాష్‌, జోగి రమేశ్‌ సహా 20 మందికి బెయిల్‌ మంజూరు చేసింది.

New Update
ogi-ramesh-devineni-avinash-

ogi-ramesh-devineni-avinash-

 TDP Office Attack Case : చంద్రబాబు నివాసం, తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వైకాపా నేతలు జోగి రమేశ్‌, దేవినేని అవినాష్‌ సహా 20 మంది దాఖలు చేసిన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ ముగించింది. దేవినేని అవినాష్‌, జోగి రమేశ్‌ సహా 20 మందికి సర్వోన్నత న్యాయస్థానం ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.ఈ మేరకు జోగి రమేష్‌, దేవినేని అవినాష్‌ దర్యాప్తునకు సహకరించాలని, అలానే దేశం వదిలి వెళ్లొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఇది కూడా చూడండి: This Week Movies: మహాశివరాత్రి స్పెషల్.. థియేటర్, ఓటీటీలో సినిమాల జాతర! లిస్ట్ ఇదే

 ఈ కేసులో మూడేళ్లు దర్యాప్తు జరపకుండా తాత్సారం చేశారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పూర్తిగా క్రిమినల్‌ ప్రొసీజర్ కోడ్‌ను ఉల్లంఘించారని మండిపడింది. ఈ కేసులో జోక్యం చేసుకునేందుకు కారణాలు కనిపించలేదని, హైకోర్టు ఉత్తర్వులపై నిందితులు పిటిషన్లు దాఖలు చేశారని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వం తరుపున వాదించిన న్యాయవాదులు నిందితులు మూడేళ్లుగా బెయిల్‌, ముందస్తు బెయిల్‌ కోరలేదని ధర్మాసనానికి తెలిపారు.

Also read :  Attempted murder : మైనర్‌ ప్రేమ.. దానికి ఒప్పుకోలేదని......

ప్రభుత్వం మారిన తర్వాతే కోర్టు మెట్లు ఎక్కారని, నిందితులకు తాము తప్పు చేశామని తెలుసని అన్నారు. ప్రభుత్వం మారాక తప్పు బయటపడుతుందని కోర్టుకు వచ్చారని వివరించారు. జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ ఉన్న మాజీ సీఎం ఇంటిపై దాడి చేయడమే కాక ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టించారని ధర్మాసనానికి విన్నవించారు. టీడీపీ ఆఫీసుపై దాడిలో దేవినేని అవినాష్‌ ప్రధాన సూత్రధారి, పాత్రధారి అని, అతను దర్యాప్తునకు ఏమాత్రం సహకరించటం లేదని ప్రభుత్వ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు.

ఇది కూడా చదవండి: ఇలా తింటే కరివేపాకుతో కూడా బరువు తగ్గొచ్చు

 వైసీపీ హయాంలో చంద్రబాబు ఇంటిపై దాడికి ప్రయత్నించిన వ్యవహారంలో కూటమి ప్రభుత్వం 20 మందికి పైగా కేసులు నమోదు చేసింది. వీరిలో వైసీపీ నేతలు దేవినేని అవినాష్, మాజీ మంత్రి జోగి రమేష్ ఉన్నారు. అయితే చంద్రబాబు ఇంటిపై దాడి చేసే నాటికి జోగి రమేష్ కేవలం ఎమ్మెల్యేగానే ఉన్నారు. ఈ కేసులో వీరిని ఇప్పటికే పోలీసులు పలుమార్లు విచారించారు. అయితే అరెస్టు చేయకుండా గతంలో కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

ఇది కూడా చదవండి: Hyderabad: టాప్‌-10లో హైదరాబాద్‌ చారిత్రక ప్రదేశాలు.. అత్యధిక పర్యాటకుల సందర్శనతో రికార్డు!

ఈ ఆదేశాల గడువు ముగిసిపోవడంతో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ దేవినేని అవినాష్, జోగి రమేష్ సహా 20 మంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో కేసు విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. వీరికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో వీరందరికీ ఊరట లభించినట్లయింది. అయితే వీరిని దేశం విడిచి వెళ్లొద్దని, పోలీసుల దర్యాప్తుకు సహకరించాలని కోర్టు ఆంక్షలు విధించింది. మరోవైపు ఈ కేసులో మూడేళ్లుగా దర్యాప్తు ముందుకు సాగకపోవడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఇది కూడా చూడండి: Breaking News : కాంగ్రెస్ మాజీ ఎంపీకి బిగ్ షాక్.. ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Heavy Rains: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌

తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్, మెదక్ తదితర జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అలాగే ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

New Update

తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. క్యుములోనింబస్‌ మేఘాల కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట, కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్, మెదక్, వికారాబాద్,  మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. 

Also Read: తెలంగాణలో భారీ వర్షాలు.. పిడుగుపాటుకు ఇద్దరు మృతి!

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా, అనంతపురం, కడప, ప్రకాశం జిల్లాల్లో జల్లులు కురుస్తున్నాయి. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలాఉండగా గంటసేపు వర్షంతో హైదరాబాద్ రోడ్లనీ చెరువులను తలపిస్తున్నాయి. పలు చోట్ల ఈదురుగాలులతో చెట్లు విరిగిపడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి మరో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్  జారీ చేసింది. 

Also Read: భూవివాదంలో సుప్రీం కోర్టు సీరియస్.. ‘ఏం జరిగినా పూర్తి బాధ్యత CS’

 

Advertisment
Advertisment
Advertisment