/rtv/media/media_files/2025/02/14/le9iohVo3S3lPEJZbNpT.jpg)
nellore sc Photograph: (nellore sc)
AP Schools: ఏపీలో పలు స్కూల్స్ మూసివేయడంపై విద్యార్థులు, గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము చదువుకున్న బడిలోనే తమ బిడ్డలను ఊళ్లోనే చదివించుకుంటామని దయచేసి ప్రభుత్వ పాఠశాలలు మూసివేయొద్దని కోరుతున్నారు. ఆనాటి ఆనాటి నుండి ప్రాథమిక పాఠశాలలో పేద విద్యార్థులు చదువుకొని ఉన్నత స్థాయి ఎదిగారు. నేటి ప్రభుత్వం దళితవాడలోని పాఠశాలను వేరే ప్రాంతంలోని పాఠశాలలో విలీనం చేయడం తగదంటున్నారు. ఈ మేరకు నెల్లూరు జిల్లా యాతులూరు గ్రామ హరిజనవాడ పాఠశాల స్టూడెంట్స్, పేరెంట్స్ కలిసి ఏంఈవో ఆఫీసుముంద ఆందోళన చేపట్టారు.
మా బడి మా కావాలి.... విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన....
— RTV (@RTVnewsnetwork) February 14, 2025
వెంకటగిరి ఎంఈఓ కార్యాలయం ఎదుట యాతలూరు దళితవాడ గ్రామస్తులు నిరసన.......
ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి మండల పరిషత్ కార్యాలయంలోని ప్రాంగణంలోని మండల విద్యాశాఖ కార్యాలయం యాతలూరు దళితవాడ గ్రామస్తులు నిరసన తెలిపారు.… pic.twitter.com/680q0AbNIP
47 ఏళ్ల పాఠశాల..
ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి మండల యాతలూరు దళితవా డ గ్రామస్తులు మండల పరిషత్ కార్యాలయం ప్రాంగణంలోని మండల విద్యాశాఖ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు ఎంపీడీవో కోటేశ్వరరావుకు పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ నూక తొట్టి చిట్టెమ్మ, గ్రామస్తులు కలిసి వినతి పత్రం అందజేశారు. యాతలూరు హరిజనవాడలో ప్రాథమిక పాఠశాలలో సుమారు 35 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గత 47 ఏళ్ల నుండి ఈ గ్రామ దళితవాడలో పాఠశాల నడుస్తోంది. ఈ స్థలం దాతలు ఇచ్చిందే కాగా దాతల సహాయంతోనే స్కూల్ భవన్ నిర్మించినట్లు గ్రామస్థులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: అదాని కేసు గురించి అడిగిన అమెరికా మీడియా.. ప్రధాని మోదీ షాకింగ్ రియాక్షన్
ఎట్టిపరిస్థితుల్లోనైనా సరే తమ గ్రామంలోని పాఠశాల ఉండాల్సిందేనంటున్నారు. తమ పిల్లలు వేరే ప్రాంతం తరలించొద్దని మండల విద్యాశాఖ అధికారిని వెంకటేశ్వర్లుకు పంజాబ్ చిన్న గురవయ్య, కోలం చెంచు కృష్ణయ్య విద్యార్థి తండ్రితోపాటు పలువురు వినతిపత్రం ఇచ్చారు.
ఇది కూడా చదవండి: RBI: న్యూ ఇండియా కో ఆపరేటివ్ బ్యాంకుకు బిగ్ షాక్.. కార్యకలాపాలు నిషేధించిన ఆర్బీఐ