/rtv/media/media_files/2025/02/23/ilXafiEXxhUeki0Q8tC8.jpg)
APPSC Group 2 Exam
ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు మెయిన్స్ తొలి పేపర్ జరిగింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు రెండో పేపర్ నిర్వహించారు. 92,250 మంది మెయిన్స్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. వీళ్లలో 86,459 మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోగా.. ఇందులో 92శాతం మంది పరీక్షకు హాజరయ్యారు.
రాష్ట్రవ్యాప్తంగా 175 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి. పలు పరీక్ష కేంద్రాల్లో కొందరు అభ్యర్థులు ఆలస్యంగా వచ్చారు. దీంతో వాళ్లని పోలీసులు, అధికారులు వెనక్కి పంపించేశారు.
Also Read: అమరావతి ఓఆర్‌ఆర్‌పై బిగ్ అప్‌డేట్.. ఐదు జిల్లాల మీదుగా నిర్మాణ
ఇదిలాఉండగా.. మొత్తం 905 పోస్టులకు గాను గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఒక్కో పోస్టుకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులు ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ ఎంపికయ్యారు. మెయిన్స్‌పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
Also Read: జిలకర బెల్లంతో పెళ్లి మండపం నుంచి గ్రూప్ 2 పరీక్షకు.. యువతి ఫొటో వైరల్
2023లో విడుదలైన గ్రూప్-2 నోటిఫికేషన్ రోస్టర్‌లో తప్పులున్నాయని అభ్యర్థులు మొదటి నుంచి వాదిస్తూనే ఉన్నారు. ఆదివారం జరగాల్సిన పరీక్షను కూడా వాయిదా వేయాలని గత కొన్నిరోజులుగా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం కూడా పరీక్షలు వాయిదా వేయాలని ఏపీపీఎస్సీకి లేఖ రాసింది. కానీ ఇందుకు సర్వీస్ కమిషన్ ఒప్పుకోలేదు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పరీక్ష వాయిదా వేయడం ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినట్లవుతుందని సర్వీస్ కమిషన్ తెలిపింది. రాజకీయ నాయకులకు ప్రయోజనం చేకూర్చేలా పరీక్ష వాయిదా వేయలేమని స్పష్టం చేసింది. దీంతో యథావిథిగా ఆదివారం గ్రూప్-2 పరీక్ష జరిగింది.
Also read: పోప్ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఏమీ చెప్పలేమంటూ అధికారుల ప్రకటన!
Also Read: మైనర్ బాలికలు శృంగారం చేస్తే తప్పుకాదు.. హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!