/rtv/media/media_files/2025/02/09/iquEzM3ntWPtLLC7zgQU.jpg)
Savitha Photograph: (Savitha)
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో ఏపీకి చెందిన ఐదుగురు మంత్రుల పర్యటన జరుగుతోంది. ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ, ఎన్‌ఎండీ ఫరూక్, సవిత, బీసీ జనార్దన్‌రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మాట్లాడారు.
ఇది కూడా చూడండి: Mastan sai: టాలీవుడ్ To పాలిటిక్స్ ఎవరిని వదలని మస్తాన్ సాయి: టోటల్ లిస్ట్ ఆడియో వైరల్!
టైలరింగ్‌లో శిక్షణ ఇచ్చి..
ఆగిపోయిన పనులు అన్నింటిని కూడా తిరిగి ప్రారంభిస్తామని సవిత తెలిపారు. ఇది బీసీల ప్రభుత్వమని, లక్ష 32 వేల మందికి స్వయం ఉపాధిని కల్పించేందుకు పథకాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. లక్ష మంది మహిళలకు టైలరింగ్‌లో శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు ఇస్తామని ఆమె తెలిపారు. అలాగే రాష్ట్రంలోని అన్ని బీసీ హాస్టలకు కూడా రూపు రేఖలు మారుస్తామన్నారు.
ఇది కూడా చూడండి: Sankranthiki Vasthunam: వెంకీ మామ ఫ్యాన్స్ గెట్ రెడీ.. యూట్యూబ్ లో 'గోదారి గట్టు మీద' సాంగ్ ఫుల్ వీడియో
ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 108 బీసీ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. వీటిని తప్పకుండా అభివృద్ధి చేస్తామని తెలిపారు. నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో అమరావతి, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్, ఉపాధి హామీ పథకానికి నిధులు వస్తున్నాయన్నారు. హామీలు ఇచ్చినవి అన్ని కూడా అమలు చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం పాలనలో రోడ్డు అన్ని నాశనం అయ్యాయని వాటి అన్నింటికి మరమ్మతులు చేస్తామని సవిత అన్నారు. దాదాపుగా 13 వేల రహదారులకు మరమ్మతులు చేస్తామని ఆమె ఈ నెల్లూరు పర్యటన సందర్భంగా తెలిపారు.
ఇది కూడా చూడండి: Pakistan PM : పరువు తీయొద్దు .. భారత్ పై గెలవండి..కప్ తీసుకురండి : పాక్ ప్రధాని