Latest News In Telugu Heavy Rains : భారీ వర్షాలు.. నిండుకుండలా మారిన జూరాల, తుంగభద్ర ప్రాజెక్టులు కర్ణాటకలో వర్షాల దంచికొడుతున్నాయి. దిగువకు భారీగా వరద ప్రవహించడంతో జూరాల, తుంగభద్ర ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ఎగువన ఉన్న నారాయణపూర్ నుంచి జూరాలకు భారీగా వరద చేరుతోంది. దీంతో జూరాల నుంచి శ్రీశైలం జలాశయం వైపు కృష్ణా నది పరుగులు తీస్తోంది. By B Aravind 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. రాహుల్‌తో భేటీ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీకి పయనమయ్యారు. రైతు రుణమాఫీ అమలు చేస్తున్న నేపథ్యంలో వరంగల్ లో కృతజ్ఞత సభ నిర్వహించాలనే యోచనలో ఉన్న ఆయన, ఈ సభకు రావాలని కాంగ్రెస్ పెద్దలను ఆహ్వానించనున్నట్లు సమాచారం. By V.J Reddy 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Rape case: తెలంగాణలో మరో దారుణం.. మద్యం తాగించి మహిళా కూలీలపై అత్యాచారం! తెలంగాణ నాగర్ కర్నూలో జిల్లాలో ఇద్దరు మహిళా కూలీలకు మద్యం తాగించి వినోద్ సింగ్, గజానంద సింగ్ అనే వ్యక్తులు అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపుతోంది. పని ఉందని తీసుకెళ్లి నమ్మించి దారుణానికి పాల్పడ్డారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ రవీందర్ తెలిపారు. By srinivas 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: తెలంగాణలో పెట్టుబడుల కోసం అమెరికాకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి TG: సీఎం రేవంత్ అమెరికా పర్యటన ఖరారైంది. ఆగస్టు 3న అమెరికా వెళ్లనున్నారు సీఎం రేవంత్. వారం రోజులపాటు అమెరికాలో పర్యటించనున్నారు. తెలంగాణలో పెట్టుబడుల కోసం పలు కంపెనీల సీఈఓలు, పారిశ్రామికవేత్తలను కలవనున్నారు. ఆగస్టు 11న తిరిగి హైదరాబాద్‌కు రానున్నారు. By V.J Reddy 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంపై సీఎం సమీక్ష నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు అధికారులతో సమీక్షించారు. పనుల్లో వేగం పెంచాలన్నారు. ఇక నుంచి ప్రతీ 4 వారాలకు ఒకసారి ఈ అంశంపై సమీక్షిస్తానన్నారు. కొడంగల్ లో ఫిష్ మార్కెట్ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. By Nikhil 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు CM Revanth Reddy: కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పురోగతిపై సీఎం రేవంత్ సమీక్ష TG: కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జిల్లా సాగు నీటి ప్రాజెక్టులపైన ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. కొడంగల్‌లో ఫిష్ మార్కెట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. By V.J Reddy 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు మంత్రి ఉత్తమ్ తో మాజీ ఎమ్మెల్యే సంపత్ భేటీ! తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ ఈ రోజు కలిశారు. అలంపూర్ లోని తుమ్మిళ్ల ప్రాజెక్ట్ కు చెందిన మూడు రిజర్వాయర్లలో ప్రధానమైన మల్లమ్మకుంట రిజర్వాయర్ ను వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. By Nikhil 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Niranjan Reddy: ఐదెకరాలలోపు రైతులకు రైతుభరోసా ఇవ్వాలి: మాజీ మంత్రి నిరంజన్ TG: ఐదెకరాలలోపు రైతులకైనా వెంటనే రైతుభరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. రుణమాఫీ అమలుపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అన్నారు. రుణమాఫీ ఇచ్చిన రైతుకు రైతు భరోసా ఎందుకివ్వరని ప్రశ్నించారు. By V.J Reddy 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: రైతు కుటుంబాలన్నీ రుణ విముక్తి పొందాలి: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సీఎం రేవంత్ రెడ్డి తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రూపాయల రైతుల రుణమాఫీకి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతు కుటుంబాలన్నీ రుణ విముక్తి పొందాలని, ఏకాదశి పండుగను ప్రతి ఇంటా ఆనందంగా జరుపుకోవాలని అన్నారు. By V.J Reddy 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn