/rtv/media/media_files/2025/03/14/njXrcaEtyOTsC1pr7gjE.jpg)
SLBC UPDATE
SLBC: SLBC నుంచి మరో అప్ డేట్ వెలువడింది. మరో 24 గంటల్లో మృతదేహాల అచూకీ లభ్యం అయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మట్టి తవ్వకాల అనంతరం లోకో ట్రాక్‌ను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు మట్టి తవ్వకాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని, ఊట నీటి పంపింగ్ ప్రక్రియ శరవేగంగా నడుస్తోందన్నారు. బుధవారం ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఆఫీస్ వద్ద టన్నెల్ లోపల కొనసాగుతున్న సహాయక చర్యలపై డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంపై సహాయక చర్యల పర్యవేక్షణ కొరకు నియమించబడిన ప్రత్యేక అధికారి శివ శంకర్ లోతేటి,(IAS) ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
4 ఎస్కేవేటర్ లతో మట్టి తవ్వకాలు..
ఫిబ్రవరి 22వ తేదీన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంలో మొత్తం 8 మంది కార్మికులు టన్నెల్‌లో చిక్కుకోగా, ఇద్దరి మృతదేహాలను గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మిగిలిన ఆరుగురి కోసం సహాయక చర్యలను వేగవంతం చేయడానికి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ లోపల సహాయక బృందాలు నిరంతరం పూర్తి స్థాయిలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. 4 ఎస్కేవేటర్ లతో మట్టి తవ్వకాలు కొనసాగిస్తున్నాం. మట్టిని కన్వేయర్ బెల్టు ద్వారా బయటికి తరలిస్తున్నట్లు, మట్టి తవ్వకాలకు అడ్డుపడుతున్న టీబీఎం భాగాలను తొలగిస్తూ సహాయక చర్యలు వేగవంతం చేస్తున్నట్లు వివరించారు.
నిమిషానికి 3600 లీటర్ల నీరు..
నిరంతరాయంగా వస్తున్న ఊట నీటిని టన్నెల్ లోపల 2.5 కిలోమీటర్లకు ఒకటి చొప్పున పెట్టిన 150 HP సామర్థ్యం గల 5 పంపింగ్ స్టేషన్ ల ద్వారా నిమిషానికి 3600 లీటర్ నీటిని కృష్ణా నదిలోకి పంపుతున్నట్లు తెలిపారు. ఉన్నత స్థాయి అధికారులు క్షేత్ర స్థాయిలో వుంటూ సహాయక బృందాలకు అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తూ సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. టన్నెల్ లో చిక్కుకున్న వారి ఆచూకీ తెలుసుకునేందుకు 24 గంటలపాటు నిరంతరం సహాయక బృందాలు శ్రమిస్తున్నయని, మట్టి తవ్వకాల అనంతరం లోకో ట్రాక్ ను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. మరో 24 గంటల్లో మృతదేహాల అచూకీ లభించే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.
Also Read: పోలీసుస్టేషన్ లోనే భర్త ముఖం పగలకొట్టిన ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్!
ఈ సమీక్ష సమావేశంలో ఆర్మీ అధికారి వికాస్ సింగ్, ఎన్ డి ఆర్ ఎఫ్, అధికారులు డాక్టర్ హరీష్, సింగరేణి మైన్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య , నాగర్ కర్నూల్ ఆర్డిఓ సురేష్ , ఎస్ డి ఆర్ ఎఫ్, హైడ్రా, దక్షిణ మధ్య రైల్వే అధికారులు, ఇరిగేషన్ ఈ ఈ శ్రీనివాస్, జే పి, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
Also Read : ఛోక్సీ మా దేశంలోనే ఉన్నాడు: బెల్జియం!
tunnel | telugu-news | today telugu news