/rtv/media/media_files/2025/03/25/iN8Y9bF2q086SjZUF0QB.jpg)
SLBC tunnel Rescue Operation
SLBC: SLBC టన్నెల్‌లో మరో మృతదేహం దొరికింది. ప్రమాద ఘటనలో కన్వేయర్ బెల్టుకు 50 మీటర్ల దూరంలో డెడ్ బాడీని గుర్తించారు. బాడీ మొత్తం కుళ్లిపోయి, దుర్వాసన వస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. నెల రోజుల క్రితం టన్నెల్లో 8 మంది చిక్కుకోగా ఇటీవల ఓ ఇంజినీర్ డెడ్ బాడీని వెలికితీసిన విషయం తెలిసిందే. కాగా మరో 6 గురి ఆచూకి లభించాల్సివుంది.
భరించలేని దుర్వాసన..
TBM మిషన్ శిథిలాల కింద డెడ్ బాడీ గుర్తించినట్లు రెస్క్యూ బృందం తెలిపింది. మరో ఆరుగురి కోసం తవ్వకాలు చేపట్టామని, గ్యాస్ కట్టర్‌లతో శిథిలాల కటింగ్ చేస్తున్నట్లు రెస్క్యూ టీమ్స్ చెప్పింది. టన్నెల్ లోపల భరించలేని దుర్వాసన వస్తోందని, దీంతో స్ప్రే బాటిల్స్‌తో లోపలికి వెళ్లిన ఆపరేషన్ చేపడుతున్నట్లు రెస్క్యూ బృందాలు చెబుతున్నాయి. మినీ హిటాచితో తవ్వకాలు జరుపుతుండగా కార్మికుడి మృతదేహం ఆనవాళ్లు బయటపడ్డట్లు వెల్లడించారు.
ఇది కూడా చూడండి: Lovers suicide : ప్రేమను పెద్దలు అంగీకరించరేమోనని..వారిద్దరూ ఏం చేశారంటే?
రెస్క్యూ ఆఫరేషన్‌లో భాగంగా టీబీఎం బేస్, ఇతర విడిభాగాలను గ్యాస్ కటర్లతో తొలగిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ర్యాట్ హోల్ మైనర్లు డ్రిల్లింగ్ చేసి మట్టిని తవ్వుతున్నారు. కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి వస్తే దానిపై వేసేలా రాళ్లను పగలగొడుతున్నారు. లోకో ట్రాలీల వరకు కట్ చేసిన విడిభాగాలు, మట్టిని, రాళ్లను మోస్తున్నారు.13.500 కిలోమీటర్ల తర్వాత సీపేజీసమస్య ఎక్కువగా ఉంది. ఆ ప్రాంతంలో 5 పంపులు కంటిన్యూగా పని చేస్తున్నా నీటి ఉధృతి తగ్గడం లేదంటున్నారు.
Also Read: మండుతున్న ఎండల్లో ఓ చల్లని వార్త...ఈ నెల 21 నుంచి...
dead-body | telugu-news | today telugu news