/rtv/media/media_files/2025/03/03/oCsrzQY2gX5Rm2TwbqXw.jpg)
Heatwave
రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్చి 21 నుంచి 24 మధ్య వర్షాలు జోరుగా కురిసాయి. ప్రజలు హాయి హాయిగా చల్ల చల్లని గాలి, వర్షాల మద్య ఎంజాయ్ చేశారు. కానీ ఇకపై అలా జరగదు. ఎండలు మళ్లీ మొదలయ్యాయి. ఉదయం కాగానే భగభగ మండిపోతున్నాయి. బయటకు వెళ్లాలంటే ప్రజలు అల్లాడిపోతున్నారు.
ఇక నేటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో వడగాలలు మొదలు కానున్నాయి. ఇప్పటికే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న ప్రజలు.. ఇప్పుడు మరింత జాగ్రత్త పడాల్సి ఉంది. తాజాగా వాతావరణ శాఖ కీలక ప్రకటన రిలీజ్ చేసింది. ఇవాళ్టి నుంచి భానుడు తన ప్రతాపం చూపిస్తాడని పేర్కొంది.
Also Read: పోలీసుస్టేషన్ లోనే భర్త ముఖం పగలకొట్టిన ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్!
తెలంగాణలో
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రజలను అలర్ట్ చేసింది. దక్షిణ ఛతీస్‌ఘడ్ నుంచి మధ్య మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకు సముద్రమట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని తెలిపింది. అందువల్ల 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చింది. దీని కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో వడగాలులు తీవ్రంగా వీసే అవకాశం ఉందని పేర్కొంది.
Also Read : రషీద్ ఖాన్ అరుదైన రికార్డు.. మలింగ, బుమ్రాలతో కలిసి
అందులో ఆదిలాబాద్‌లో గరిష్టంగా 39.3, నల్గొండలో 35 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చింది. ఇక నిన్నటి విషయానికొస్తే.. ఆదిలాబాద్‌లో 38.3 డిగ్రీలు, మహబూబ్ నగర్‌లో 35.5 డిగ్రీలు, నిజామాబాద్‌లో 37.3 డిగ్రీలు, హనుమకొండలో 35 డిగ్రీలు, భద్రాచలంలో 38 డిగ్రీలు, ఖమ్మంలో 36.6 డిగ్రీలు, నల్లగొండలో 36 డిగ్రీలు, మెదక్‌లో 35.4 డిగ్రీలు, రామగుండంలో 35.6 డిగ్రీలు, హైదరాబాద్‌లో 33.8 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Also Read : ఛోక్సీ మా దేశంలోనే ఉన్నాడు: బెల్జియం!
ఏపీలో వాతావరణం
అలాగే ఏపీలో సైతం సూర్యుడు తన ప్రతాపం చూపించబోతున్నాడు. నేడు 108 మండలాల్లో తీవ్రమైన వడగాలులు వీచే ఛాన్స్ ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో -15 డిగ్రీలు, విజయనగరం జిల్లాలో- 21 డిగ్రీలు, పార్వతీపురంమన్యం జిల్లాలో-10 డిగ్రీలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో -8డిగ్రీలు, అనకాపల్లిలో- 7 డిగ్రీలు, కాకినాడలో -7 డిగ్రీలు, కోనసీమలో -3 డిగ్రీలు, తూర్పుగోదావరిలో- 13 డిగ్రీలు, ఏలూరులో -5 డిగ్రీలు, కృష్ణాలో -2 డిగ్రీలు, ఎన్టీఆర్- జిల్లాలో 6 డిగ్రీలు, గుంటూరులో -3 డిగ్రీలు, పల్నాడు-లోని 8 మండలాల్లో వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉండే ఛాన్స్ ఉందని అంచనా వేసింది.
Also Read : ఇక ఏటీఎం నుంచి పీఎఫ్ నగదు తీసుకోవచ్చు...ఎప్పటి నుంచో తెలుసా?
(weather | AP Weather Alert | ap today weather update | telangana-weather | telangana weather report today | latest-telugu-news | telugu-news)