Aruna D.K : ఎంపీ డీకే అరుణ ఇంట్లో అగంతకుడు...ఏం చేశాడంటే?

జూబ్లీహిల్స్‌ లోని ఎంపీ డీకే అరుణ నివాసంలోకి శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని అగంతకుడు ప్రవేశించాడు. ముసుగు, గ్లౌజులు ధరించిన దుండగుడు ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంట్లోకి ప్రవేశించగానే సీసీ కెమెరాలు పూర్తిగా ఆఫ్‌ చేసి సుమారు గంటన్నర పాటు ఇంట్లోనే తిరిగాడు.

New Update
D. K. Aruna

D. K. Aruna

Aruna D.K : తెలంగాణలో శాంతిభద్రతలు అదుపుతప్పుతున్నాయా? ప్రజా ప్రతినిధులకే రక్షణ లేకుండా పోయిందా? అంటే ఈ ఘటన అవుననే సమాదానమే ఇస్తోంది. బీజేపీ సీనియర్‌ నేత, మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి నిన్న రాత్రి ఒక అగంతకుడు చొరపడ్డాడు. అంతేకాదు ఏకంగా గంటన్నర పాటు ఇంట్లోనే కలియతిరిగాడు. ఈ విషయం రాష్ర్ట వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. వివరాల ప్రకారం...


 Also Read :  Kumbh Mela: కొంపముంచిన కుంభమేళా పబ్లిసిటీ.. ఇప్పుడు రూ.12.8 కోట్ల ట్యాక్స్ కట్టేదెలా..?

జూబ్లీహిల్స్‌ లోని ఎంపీ డీకే అరుణ నివాసంలోకి శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని అగంతకుడు ప్రవేశించాడు. ముసుగు, గ్లౌజులు ధరించిన దుండగుడు అందరి కళ్లు గప్పి ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంట్లోకి ప్రవేశించగానే ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు పూర్తిగా ఆఫ్‌ చేశారు. కిచెన్, హాల్, సీసీ కెమెరాలు ఆఫ్ చేసి సుమారు గంటన్నర పాటు ఇంట్లోనే అటూ ఇటూ తిరిగాడు. అలికిడికి కుటుంబసభ్యులకు మెలకువ వచ్చి లేశారు. ఇంట్లో ఒక అగంతకుడు ఉండడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు భయాందోళనకు గురై.. విషయాన్ని వెంటనే ఎంపీ డీకే అరుణ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆమె అప్రమత్తమై జూబ్లీహిల్స్ పోలీసులకు  ఫిర్యాదు చేశారు.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి పరిసరాలను పరిశీలించారు. ఇంటితో పాటు స్తానికంగా ఉన్న సీసీకెమెరాలను జల్లెడ పడుతున్నారు.ఇందులో కుట్ర కోణం దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. తన ఇంటికి భద్రత పెంచాలని డీకే అరుణ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. కాగా, దుండగుడు ఇంట్లో చొరబడ్డ సమయంలో డీకే అరుణ లేకపోవడం గమనార్హం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు వేగం పెంచారు.

Also Read: Court Movie: కంటెంట్ ముఖ్యం బిగులు.. పావురాలు ఎగరేస్తూ 'కోర్ట్' టీమ్ సక్సెస్ సెలెబ్రేషన్స్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు