/rtv/media/media_files/2025/03/26/ZhFHdor3aJBFOXeFkMfW.jpg)
Telangana Cabinet Expansion
తెలంగాణలో కేబినెట్ విస్తరణ దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో చోటు ఎవరికి దక్కుతుంది? అన్న అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే.. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి తన X ఖాతాలో చేసిన చేసిన పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, శ్రీహరి ముదిరాజ్ పేర్లతో ఆయన పోస్ట్ చేశారు. దీంతో ఈ నలుగురికి రేవంత్ కేబినెట్లో బెర్త్ ఖాయంగా కనిపిస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ప్రస్తుతం కేబినెట్లో ఎవరికి ప్రాతినిధ్యం లేదు. దీంతో సుదర్శన్ రెడ్డిని కేబినెట్లోకి తీసుకోవాలని రేవంత్ రెడ్డి నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Komatireddy Rajagopal Reddy: మా రేవంత్ రెడ్డి చాలా మంచోడు...లేకుంటే....
Sudharshan Reddy !
— Sama Ram Mohan Reddy (@RamMohanINC) March 25, 2025
Rajgopal Reddy !
Vivek venkatswamy !
Srihari Mudiraj !
ఎన్నికల సమయంలో రాజగోపాల్, వివేక్ కు హైకమాండ్ హామీ..
రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన సమయంలో మంత్రివర్గంలోకి తీసుకుంటామని హైకమాండ్ పెద్దలు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆ హామీని నిలబెట్టుకోవాలని నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయనకు బెర్త్ కన్ఫామ్ అయినట్లు చర్చ సాగుతోంది. ఇంకా వివేక్ వెంకటస్వామికి కూడా పార్టీలో చేరిన సమయంలో మంత్రి వర్గంలోకి తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇంకా బీసీ కోటాలో మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ కు కూడా చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy : రాష్ట్రంలో ఏ ఉప ఎన్నికలు రావు.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ఇటీవల ఎమ్మెల్సీలుగా ఎన్నికైన అద్దంకి దయాకర్, విజయశాంతి కూడా మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నాలు చేశారు. కానీ మండలి నుంచి ఈ సారి ఎవరికీ చోటు ఇవ్వొద్దని హైకమాండ్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అద్దంకి దయాకర్, విజయశాంతికి ఈ సారి అవకాశం లేదన్న ప్రచారం సాగుతోంది.
( telugu-news | latest-telugu-news)