Konda surekha: ప్రతి క్షణం మాకు అదే తపన.. మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు!
ప్రతిక్షణం రాష్ట్ర ప్రజలు, వరంగల్ బిడ్డల కోసం సీఎం రేవంతన్న పరితపిస్తున్నాడని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఆదివారం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో రూ.800 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సీఎంను సురేఖ కొనియాడారు.
Konda surekha: రాష్ట్రంలో గత పాలకులు సృష్టించిన విధ్వంసానికి ప్రస్తుతం ఎన్నో ఆర్థిక అవస్థలు ఎదుర్కొంటున్నామని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రాష్ట్ర అభివృద్ధిలో ఎక్కడా తగ్గడం లేదని చెప్పారు. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో పర్యటించి, పలు శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రూ.800 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఆడబిడ్డల స్వయం సహాయక సంఘాలకు ఆర్టీసీ బస్సులు అందజేశారు. మహిళా శక్తి పథకం ద్వారా లబ్ధిదారులకు ఆర్టీసీ బస్సులను అందించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన సభలో కొండా సురేఖ బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
మేమంతా అండగా ఉంటాం..
ప్రతి క్షణం తెలంగాణ ప్రజలు, వరంగల్ బిడ్డల కోసం సీఎం రేవంతన్న పరితపిస్తున్నాడని చెప్పారు. అందుకు సీఎం రేవంతన్నకు తాము అంతా అండగా ఉంటామన్నారు. వరంగల్ ను సొంత ప్రాంతంలా చూస్తున్న సీఎం రేవంతన్నకు మంత్రి సురేఖ థ్యాంక్స్ చెప్పారు. గత ప్రభుత్వంలో స్టేషన్ ఘనపూర్, వరంగల్ జిల్లాలోని ఇతర నియోజకవర్గాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఫైర్ అయ్యారు. అయితే రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక వరంగల్ ను తన సొంత ప్రాంతంలా అభివృద్ధి చేస్తున్నారన్నారు. తన సహచర మంత్రి సీతక్క కూడా రాష్ట్రంలోని మహిళా అభ్యున్నతికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నరని ప్రశంసించారు. వరంగల్ రెండోవ రాజధాని లాగా అభివృద్ధి చేయడం తకెంతో సంతోషంగా ఉందన్నారు.
టూరిజం స్పాట్ గా డెవలప్..
వరంగల్ లో టూరిజం డెవలప్ మెంట్ కి మంచి అవకాశాలున్నాయని మంత్రి సురేఖ అభిప్రాయపడ్డారు. ఈ ప్రాంతాన్ని ఒక మంచి టూరిజం స్పాట్ లాగా డెవలప్ చేయాలని సీఎంను కోరారు. రాణి రుద్రమ దేవి, సమ్మక్క-సారక్క లాంటి గొప్పగొప్ప మహిళా మణులు ఏలిన గడ్డ ఈ వరంగల్ అని ఆమె గుర్తు చేశారు. అయితే ఇక్కడ ఏం చేయాలన్న ఆర్కియాలజీ డిపార్టుమెంటు వారు కొంచం సహకరించడం లేదని సీఎం దృష్టికి మంత్రి సురేఖ తీసుకెళ్ళారు. విషయంపై దృష్టి సారించాలని సీఎంను మంత్రి సురేఖ కోరారు.
రేవంతన్న మాట ఇస్తే తప్పరని.. పాత వరంగల్ ను కొత్తగా సరికొత్తగా చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ హామీలు నేరవేరుస్తూ ముందుకు వెళ్ళుతున్నారన్నారు. రేవంతన్న అసెంబ్లీలో ఇచ్చిన స్పీచ్ చూస్తే కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి ఏం చేస్తుందో.. ఏం చేయాలనుకుంటుందో అందరికీ అర్థం అవుతుందని స్పష్టం చేశారు. ఎయిర్ పోర్టు, టెక్సటైల్ పార్కు కూడా త్వరలో రాబోతున్నాయన్నారు. వీటి కోసం రేవంతన్న ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో సీఎం వెంట తాము అందరం ఉంటామని మంత్రి సురేఖ తెలిపారు.

Minister Konda Surekha

Also Read: AR Rahman: నోరు తెరిస్తే ఏమౌతుందో తెలిసిందా.. యూట్యూబర్ అల్లాబాడియాకు రెహ్మాన్ చురకలు!
రేవంతన్న మాట ఇస్తే తప్పరని.. పాత వరంగల్ ను కొత్తగా సరికొత్తగా చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ హామీలు నేరవేరుస్తూ ముందుకు వెళ్ళుతున్నారన్నారు. రేవంతన్న అసెంబ్లీలో ఇచ్చిన స్పీచ్ చూస్తే కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి ఏం చేస్తుందో.. ఏం చేయాలనుకుంటుందో అందరికీ అర్థం అవుతుందని స్పష్టం చేశారు. ఎయిర్ పోర్టు, టెక్సటైల్ పార్కు కూడా త్వరలో రాబోతున్నాయన్నారు. వీటి కోసం రేవంతన్న ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో సీఎం వెంట తాము అందరం ఉంటామని మంత్రి సురేఖ తెలిపారు.
Also Read: అమెరికా నుంచి అక్రమ వలసదారులు ఔట్.. అమృత్‌సర్‌లో ల్యాండ్ అయిన విమానం