Hydra: హైడ్రాకు అండ‌గా ఉంటాం.. న్యాయ‌నిపుణుల కీలక ప్రకటన!

హైడ్రాకు న్యాయ స‌ల‌హాలు అందించ‌డానికి ఎళ్లప్పుడూ అందుబాటులో ఉంటామ‌ని న్యాయనిపుణులు తెలిపారు. ఏవీ రంగ‌నాథ్‌ ఆధ్వర్యంలో జరిగిన స‌ద‌స్సులో పాల్గొని విలువైన సూచ‌న‌లు చేశారు. ప్రజలకు మేలు చేసే చ‌ట్టాలను ప‌టిష్టంగా అమ‌లు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంద‌న్నారు.

New Update
Hydra-commissioner

హైడ్రా చీఫ్ ఏవీ రంగనాథ్ (ఫైల్ ఫొటో)

Hydra ; చెరువుల ప‌రిర‌క్షణ‌, పున‌రుజ్జీవనానికి కృషి చేస్తున్న హైడ్రాకు త‌గిన న్యాయ స‌ల‌హాలు అందించ‌డానికి ఎళ్లప్పుడూ అందుబాటులో ఉంటామ‌ని న్యాయ నిపుణులు వెల్లడించారు. ప్రభుత్వ స్థలాల‌తో పాటు ర‌హ‌దారులు, పార్కులు క‌బ్జా కాకుండా కాపాడుతున్న హైడ్రాను న్యాయ నిపుణులు అభినందించారు. చెరువుల ప‌రిర‌క్షణ‌, ప్రభుత్వ భూములను కాపాడ‌డంలో త‌లెత్తుతున్న ఇబ్బందులు, న్యాయ‌ప‌ర‌మైన‌ అంశాల‌లో ఎలాంటి చ‌ర్యలు తీసుకోవాల‌నే విష‌యాల‌పై శ‌నివారం హైడ్రా కార్యాల‌యంలో హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స‌ద‌స్సులో ప‌లువురు న్యాయ నిపుణులతో పాటు వివిధ‌ ప్రభుత్వ శాఖ‌ల్లో ప‌ని చేసిన‌ విశ్రాంత అధికారులు పాల్గొని విలువైన సూచ‌న‌లు చేశారు. అనేక అంశాల‌పై సందేహాల‌ను నివృత్తి చేశారు. చెరువుల‌ను పున‌రుద్ధరించ‌డం.. వ‌ర‌ద కాలువ‌ల‌ను స‌జీవంగా ఉంచ‌డంతోనే న‌గ‌రానికి వ‌ర‌ద ముప్పు త‌ప్పుతుంద‌ని నిపుణులు సూచించారు. గొలుసుక‌ట్టు చెరువులు లింకు తెగిపోవ‌డంతో 2 సెంటీమీట‌ర్లు దాటి వ‌ర్షం ప‌డితే న‌గ‌ర ర‌హ‌దారులు, లోత‌ట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయ‌ని అభిప్రయాప‌డ్డారు.

ప‌టిష్టంగా అమ‌లు చేయాలి..

చెరువుల ప‌రిర‌క్షణ‌, ప్రభుత్వ భూముల సంర‌క్షణ‌కు సంబంధించి చ‌ట్టాలున్నప్పటికీ వాటిని అమ‌లు ప‌టిష్టంగా అమ‌లు చేయాల్సిన బాధ్యత ఉంద‌న్నారు. ప్రభుత్వ శాఖ‌ల మ‌ధ్య స‌మ‌న్వయాన్ని హైడ్రా తీసుకు వ‌చ్చి.. భ‌విష్యత్ త‌రాల‌కు ప‌ర్యావ‌ర‌ణంతో కూడిన మెరుగైన జీవ‌నాన్ని అందిస్తుంద‌నే ఆశాభావం వ్యక్తం చేశారు.  చెరువు శిఖం భూముల విష‌యంలో ప్రైవేటు ప‌ట్టాలున్న వారు వ్యవ‌సాయం మాత్రమే చేసుకోవాల్సి ఉంది. మ‌రే ఇత‌ర హ‌క్కులు ఉండ‌వ‌ని చెప్పారు.  చెరువుల మ‌ధ్యనుంచి ప‌లు చోట్ల ర‌హ‌దారులు నిర్మించార‌ని.. అయితే ఇరువైపులా నీటికి అడ్డు లేకుండా పై వంతెన‌లు క‌డితే బాగుంటుంద‌ని సూచించారు. చెరువుల బ‌ఫ‌ర్ జోన్లలో మ‌ట్టితో నింపేసి.. వారి స్థలం ముంపు ప్రాతంలో లేద‌ని చూపించే ప్రయ‌త్నాల‌ను ఎన్ఆర్ఎస్ ఏ, స‌ర్వే ఆఫ్ ఇండియా, గ్రామీణ మ్యాప్‌ల ద్వారా  నివారించవ‌చ్చు అని అన్నారు. చెరువులు, ప్రభుత్వ భూముల ఆక్రమ‌ణ‌లు, అనుమ‌తి లేని లే ఔట్లలోని ఇంటి స్థలాలను రిజిస్ట్రేష‌న్ చేయ‌డానికి అవ‌కాశం లేని వ్యవ‌స్థ రావాల‌ని సూచించారు. అలాగే మాస్టర్ ప్లాన్‌లో ప్రజావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థలాలు దుర్వినియోగం అయితే నేరుగా చ‌ర్యలు తీసుకోవ‌చ్చున‌న్నారు. హెచ్ ఎం డీఏ ప‌రిధిలోకి గ్రామాలు చేరిన‌ప్పడు గ్రామ‌పంచాయ‌తీ లే ఔట్లు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ చెల్లవ‌ని స్పష్టం చేశారు.  

ఇది కూడా చదవండి: రుణమాఫీ 70శాతమే.. 100శాతం అని చెప్పడానికి సిగ్గుండాలి: కేటీఆర్

లే ఔట్ల‌లో 30 శాతం భూమిని ప్రజావ‌స‌రాల‌కోసం కేటాయించాల్సి ఉంటుంద‌ని స్పష్టం చేశారు. భూ వినియోగానికి సంబంధించిన సవరణలు ప్రభుత్వ ప‌రిధిలోనే ఉంటాయ‌న్నారు. అనుమ‌తి పొందిన లే ఔట్‌ను అతిక్రమించి నిర్మాణాలు చేప‌డితే చట్టం ప్రకారం కూల్చివేయవచ్చని వర్క్‌షాప్ నొక్కి చెప్పింది. హైకోర్టు సీనియ‌ర్ న్యాయ‌వాది రేసు మహేందర్ రెడ్డి,  జీహెచ్ ఎంసీ, హైడ్రా హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్ కె. ర‌వీంద‌ర్‌రెడ్డి, జీహెచ్ ఎంసీ, హైడ్రా  హైకోర్టు  అసిస్టెంట్ స్టాండింగ్ కౌన్సిల్ సీహెచ్. జ‌య‌కృష్ణ, రిటైర్డ్ డిప్యూటీ క‌లెక్టర్‌, న్యాయ‌, రెవెన్యూ రంగ నిపుణుడు ఎన్. శ్రీనివాస్ రావు, సీసీఎల్ ఏ రిటైర్డ్ స్పెష‌ల్ డిప్యూటీ క‌లెక్టర్ బి. మధుసూధ‌న్‌, మాజీ సీనియర్ అడ్వకేట్ మరియు ప్రొఫెసర్ డా.పి. రాజ్ గోపాల్ తో పాటు ప‌లువురు సీనియ‌ర్ న్యాయ‌వాదులు, వివిధ శాఖ‌ల‌కు చెందిన నిపుణులు  ఈ స‌ద‌స్సలో పాల్గొన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG Crime: నారాయణ విద్యార్థి సూసైడ్.. సబ్జెక్టు ఫెయిల్ అయినందుకు ప్రిన్సిపాల్ వేధింపులు..

హైదరాబాద్‌లోని ఘట్కేసర్‌లో నారాయణ కాలేజీ విషాదం చోటు చేసుకుంది. ప్రిన్సిపాల్ రామ్‌రెడ్డి వేధింపులతో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న జశ్వంత్‌ గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

New Update
Student Jaswant suicide

Student Jaswant suicide

TG Crime: ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఓ యువ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన హైదరాబాద్ సమీపంలోని ఘట్కేసర్‌లో వెలుగులోకి వచ్చింది. నారాయణ కాలేజీలో చదువుతున్న జశ్వంత్ అనే విద్యార్థి ఇటీవల జరిగిన పరీక్షల్లో ఒక సబ్జెక్టులో ఫెయిలవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. అదే సమయంలో..  కళాశాల ప్రిన్సిపాల్ రామ్ రెడ్డి అతన్ని పిలిచి తీవ్రంగా మందలించాడు. తనును అవమానించినట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. చదువులో తప్పిదం జరిగినప్పటికీ, అందుకు తగినంత మద్దతు లభించకపోవడం, పైగా అదనపు ఒత్తిడితో అవమానం ఎదురుకావడం ఈ ఘోర నిర్ణయానికి దారి తీసినట్లుగా తెలుస్తోంది.

Also Read :  ఈడీకి సుప్రీంకోర్టు బిగ్ షాక్..  సోనియా, రాహుల్ లకు భారీ ఊరట!

గడ్డి మందు తాగి..

జశ్వంత్ తన మనసులో కలిగిన బాధను కుటుంబ సభ్యులకు, స్నేహితులకు వివరించకుండా, మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. మానసికంగా దిగులుకు గురైన అతను చివరికి గడ్డి మందు తాగడం ద్వారా ప్రాణాలు తీసుకున్నాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే పరిస్థితి విషమంగా ఉండటంతో డాక్టర్లు చికిత్స అందించ లేకపోయారు. సూసైడ్ నోట్‌ను పరిశీలించిన పోలీసులు.. కాలేజీ ప్రిన్సిపాల్‌పై కేసు నమోదు చేశారు.

 ఇది కూడా చదవండి: పురుషులలో ఆండ్రోజెన్ లోపం ఉంటే ఏమి జరుగుతుంది?

ఈ ఘటన విద్యార్థులపై కాలేజీల్లో  ఒత్తిడి పెరుగుతున్నట్లు తెలుస్తోంద. చదువుకునే సమయంలో ప్రతి ఒక్క విద్యార్థికి మద్దతు, అవగాహన కలిపించాలి. పరీక్షణ సమయంలో విద్యార్థుల మానసిక ఆరోగ్యం, విద్యాసంస్థల బాధ్యత, విద్యార్థి సంక్షేమంపై సమగ్ర దృష్టి పెట్టాలి. నారాయణ కాలేజీల్లో ఇలాంటి ఘటనలు తరుచూ జరుగుతునే ఉన్నాయి. జశ్వంత్ మృతితో అతని కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మంచిగా చదువుకుంటున్న కొడుకు మృతి చెందటంతో వారు కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్ళి జరగకుండా చూడాలని వారు కోరుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేసిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు. 

 ఇది కూడా చదవండి: వేసవిలో పేగు ఆరోగ్యాన్ని ఇలా కాపాడుకోండి

Also Read :  పురుషులలో ఆండ్రోజెన్ లోపం ఉంటే ఏమి జరుగుతుంది?

ts-crime | ts-crime-news | crime news | latest-news | telugu-news )

Advertisment
Advertisment
Advertisment