HCU: హెచ్‌సీయూలో తీవ్ర ఉద్రిక్తత.. అసలేంటీ వివాదం ?

హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూముల విక్రయాన్ని నిరసిస్తూ గత కొన్నిరోజులుగా వర్సిటీ విద్యార్థులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఇంతకీ ఈ వివాదం ఏంటో తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ టైటిల్‌పై క్లిక్‌ చేయండి.

New Update
Students Protest at Hyderabad Central University

Students Protest at Hyderabad Central University

హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూముల విక్రయాన్ని నిరసిస్తూ గత కొన్నిరోజులుగా వర్సిటీ విద్యార్థులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. భూముల వేలాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ శనివారం రాత్రి మరోసారి పెద్ద ఎత్తున నిరసనకు దిగారు.  అక్కడికి చేరుకున్న పోలీసులు విద్యార్థుల ఆందోళనను అణిచివేసే ప్రయత్నం చేశారు. అయితే ఆదివారం యూనివర్సిటీ పరిధిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో పలువురు వర్కర్లు చెట్లు నరికేస్తుండగా విద్యార్థులు అడ్డుకున్నారు. 

దీంతో మళ్లీ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. వర్సిటీ మెయిన్ గేటుకు పోలీసులు తాళం వేశారు. మరోవైపు వర్సిటీ ప్రాంగణంలో జేసీబీలతో చెట్లు కూల్చేసి నేలను చదును చేసేందుకు యత్నిస్తున్నారు. దీంతో ఆందోళనకు దిగిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. దీన్ని తెలంగాణ SFI తీవ్రంగా ఖండించింది. విద్యార్థులను విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తోంది. 

Also Read: మావోయిస్టులకు బిగ్ షాక్.. లొంగిపోయిన 50 మంది నక్సలైట్లు!

అసలేంటి వివాదం ?

హెచ్‌సీయూలో వర్సిటీ భూములను ఏదో ఒక సాకుతో ప్రభుత్వం వెనక్కి లాక్కుంటోందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. వర్సిటీ ఏర్పడ్డాక దాదాపు 50 ఏళ్లలో 500 ఎకరాల భూమిని లాక్కున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. 2300 ఎకరాల్లో హెచ్‌సీయూను ఏర్పాటు చేయగా.. ఇప్పడు యూజీసీ లెక్కల ప్రకారం 1800 ఎకరాలు మాత్రమే ఉందని ఆరోపణలు చేస్తున్నారు. 

Also Read: ''నెక్ట్స్‌ చంపేది నిన్నే''.. ఆ పార్టీ నేతకు ఫోన్‌ చేసి బెదిరించిన బిష్ణోయ్‌ గ్యాంగ్

మళ్లీ ఇప్పుడు టీజీఐఐసీ ద్వారా 400 ఎకరాలను వేలం వేసేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో విద్యార్థి సంఘాలు, వర్కర్లు, టీచింగ్, నాన్‌టీచింగ్‌ సిబ్బంది ఆందోళనకు దిగారు. అయితే ఈ స్థలం హెచ్‌సీయూది కాదని.. కోర్టు ఇచ్చిన తీర్పు మేరకే 400 ఎకరాల భూమిని టీజీఐఐసీకి అప్పగించినట్లు ప్రభుత్వం చెప్పింది. ఇది పూర్తయితే హెచ్‌సీయూలో ఇక మిగిలేది 1400 ఎకరాలు మాత్రమే. HCU పూర్వ విద్యార్థులైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్‌ బాబు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని.. హెచ్‌సీయూ భూములు వర్సిటీకే చెందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.  హెచ్‌సీయూ చుట్టూ ఐటీ కారిడర్ ఉండటం వల్ల ఈ భూములను విక్రయిస్తే భారీగా ఆదాయం వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. 400 ఎకరాలను విక్రయిస్తే దీని మార్కెట్‌ విలువ ప్రకారం రూ.10 వేల కోట్లు వస్తుందని ప్రభుత్వం అంచనా వేసినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. 

 hyderabad-central-university | telugu-news | rtv-news | protest

Advertisment
Advertisment
Advertisment