Cabinet expansion : కొత్త మంత్రుల లిస్టుపై ట్విస్ట్‌...ఆయనకు పదవిపై రాహుల్‌ అభ్యంతరం

తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ ఇప్పట్లో తేలేలా లేదు. ఏదో ఒక కారణంతో గడచిన 15 నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న విస్తరణ మరోసారి వాయిదా పడినట్లే. ఈ నెల 3న మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అంతా భావించారు. అయితే ఢిల్లీ కేంద్రంగా కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి.

New Update
Cabinet expansion

Cabinet expansion2

Cabinet expansion : తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ ఇప్పట్లో తేలేలా లేదు. ఏదో ఒక కారణంతో గడచిన 15 నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న విస్తరణ మరోసారి వాయిదా పడినట్లే. ఈ నెల 3వ తేదీన మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అందరూ భావించారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ కూడా తీసుకున్నట్లు ప్రచారం సాగింది. అయితే ఢిల్లీ కేంద్రంగా చివరి నిమిషంలో కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. మంత్రుల లిస్టు విషయంలో పార్టీ అగ్రనేత రాహుల్ ట్విస్ట్ ఇచ్చారు. కొందరి పేర్ల పైన అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో, పార్టీ నేతలు కొత్త జాబితా పైన కసరత్తు చేస్తున్నారు. మరో ఇద్దరి పేర్లు తెర మీదకు వస్తున్నాయి.

Also Read: Former Union Minster Girija Vyas:దేవుడి హారతి మంటలు అంటుకుని తీవ్ర గాయాలపాలైన మాజీ కేంద్ర మంత్రి

 తెలంగాణలో ఈ నెల 3వ తేదీన మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని అందరూ భావించారు. గత నెలలో ఢిల్లీలో జరిగిన సమావేశంలో ప్రస్తుత కేబినెట్ లో ఆరు స్థానాలు ఖాళీగా ఉండగా.. నలుగురికి తొలుత అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. సామాజిక, - ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా వీరి ఎంపికకోసం కసరత్తు చేశారు. తాజాగా ఉగాది నాడు గవర్నర్ తో సీఎం రేవంత్ సమావేశమైన  సమయంలో నూ మంత్రివర్గ విస్తరణ గురించి వెల్లడించినట్లు తెలిసింది. 

Also Read: యూట్యూబర్ రణ్‌వీర్‌ అల్హాబాదియాకు షాక్.. సుప్రీం కోర్టు కీలక ప్రకటన

 మంత్రివర్గ విస్తరణలో పేర్ల పైన రాహుల్ ఆరా తీసినట్లు సమాచారం. అందులో కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డికి అవకాశం ఇవ్వటం పైన ప్రశ్నించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట రెడ్డి మంత్రిగా ఉండగా.. ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి తిరిగి అవకాశం ఎలా ఇస్తారని రాహుల్ పార్టీ ముఖ్య నేతలను ప్రశ్నించినట్టు సమాచారం. అయితే, పార్టీలో చేరే సమయంలోనే వివేక్ తో పాటుగా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి పైన హామీ ఇచ్చినట్లు పార్టీ నేతలు వివరించారు.  అయినా వినని రాహుల్‌ తాము పూర్తి స్థాయిలో ఆలోచన చేసిన తరువాత తుది నిర్ణయం చెప్పే వరకూ వేచి చూడాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: USA: యెమెన్ పై అమెరికా దాడులు..వందల మంది మృతి

ఇదే సమయంలో సీనియర్ నేత జానా రెడ్డి పార్టీ హైకమాండ్ కు రాసిన లేఖ సంచనలంగా మారుతోంది. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ కు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదని.. ఆ జిల్లాలకు అవకాశం ఇవ్వాలని జానారెడ్డి లేఖలో కోరారు. ఇదే సమయంలో సామాజిక వర్గాల వారీగా పలువురు నేతలు ఢిల్లీ కేంద్రంగా లాబీయింగ్ ముమ్మరం చేసారు. తమ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలని పెద్ద ఎత్తున ఒత్తిడి పెంచుతున్నారు. ఇటు, ఇప్పటికే మంత్రివర్గంలో సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, వాటికి శ్రీహరి, వివేక పేర్లు ఖరారైనట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పుడు రాహుల్ అభ్యంతరంతో ఈ పేర్ల లిస్టులో మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. పార్టీలో సీనియర్లు.. సామాజిక అంశాలు.. జిల్లాల కూర్పు తెర మీదకు రావటంతో ఈ నెల 3న మంత్రివర్గ విస్తరణ జరగటం సందేహంగానే కనిపిస్తోంది. ప్రస్తుతం రేవంత్ తో పాటుగా పార్టీ ముఖ్య నేతలు ఢిల్లీలోనే ఉన్నారు. దీంతో, మంత్రివర్గ విస్తరణ పైన ఢిల్లీలో ఈ రోజు కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇది కూడా చూడండి: Cinema: రాబిన్ హుడ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో డాన్స్ తో అదరగొట్టిన వార్నర్

Advertisment
Advertisment
Advertisment