Cabinet expansion : నల్లగొండ కాంగ్రెస్‌లో కోల్డ్‌ వార్‌.. విస్తరణకు మళ్లీ బ్రేక్‌

తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు మళ్లీ బ్రేక్‌ పడింది. విస్తరణకు ముహూర్తం ఫిక్స్‌ అయ్యిందనుకునేలోపే..ప్రతిసారి ఏదో ఒక సమస్య వచ్చిపడుతోంది. ఉగాదికి మంత్రివర్గ విస్తరణ..ఏప్రిల్‌ 3న ప్రమాణ స్వీకారం ఉంటుందని అంతా భావించారు. కానీ ఇప్పుడు ప్రచారంగానే మిగిలిపోయింది.

New Update
Telangana Cabinet Expansion

Telangana Cabinet Expansion

Cabinet expansion : తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు మళ్లీ బ్రేక్‌ పడింది. విస్తరణకు ముహూర్తం ఫిక్స్‌ అయ్యిందనుకునేలోపే.. ప్రతిసారి ఏదో ఒక సమస్య వచ్చి అడ్డుపడుతోంది.  ఉగాదికి మంత్రివర్గ విస్తరణ... ఏప్రిల్‌ 3న కొత్తమంత్రుల ప్రమాణస్వీకారం జరుగుతుందని అంతా భావించారు. కానీ ఇప్పుడు ఇది కేవలం ప్రచారంగానే మిగిలిపోయింది. ఏప్రిల్ 3న కేబినెట్ విస్తరణకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు కాంగ్రెస్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీంతో మంత్రి పదవి దక్కుతుందనుకున్న వారి ఆశలన్నీ అడియాశలయ్యాయి.  రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, వివిధ సామాజిక వర్గాలు, కులాల వారీగా తెరపైకి తీసుకొచ్చిన డిమాండ్లే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

Also Read: ఈ సారి ట్రంప్‌ కొరడా ఆరోగ్య శాఖ పై..వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు!

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు దాటింది. కానీ ఇప్పటివరకు మంత్రి వర్గవిస్తరణ జరగలేదు. కేబినెట్ విస్తరణ అనుకున్న ప్రతిసారి  సవాలక్ష సమస్యలు, ఎన్నో సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. కేబినెట్‌లో ఆరు స్థానాలను భర్తీ చేయడమే ఇప్పుడు హైకమాండ్ కు ఒక సవాలుగా మారింది. కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైందన్న వార్తలు వెలుగులోకి రాగానే.. పార్టీలో అంతర్గత విభేదాలు మొదలయ్యా యి. కులాల వారీగా విడిపోయిన నేతలు తమతమ డిమాండ్లను తెరపైకి తెస్తున్నారు. సామాజిక న్యాయం చేయాలంటూ ఎవరి తరహాలో వారు డిమాండ్ చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన నేతలంతా ఏకమై.. అధిష్టానానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. 

Also Read: కొడాలి నానిని కాపాడేందుకు రంగంలోకి డాక్టర్ పాండా.. ఆయన ట్రాక్ రికార్డ్ తెలిస్తే షాక్ అవుతారు!

నల్లగొండ కాంగ్రెస్‌లో కోల్డ్‌వార్‌ 


మంత్రివర్గ విస్తరణ వేళ నల్లగొండ కాంగ్రెస్‌లో మరోసారి కోల్డ్‌వార్‌ బయటపడింది, మంత్రి వర్గ విస్తరణ జరిగితే తనకు మంత్రి పదవి వస్తుందనుకున్న నల్లగొండ జిల్లా నేత -- కోమటిరెడ్డి రాజగోపాల్‌కి సీనియర్‌ నేత జానారెడ్డి చెక్ పెట్టారు. కేబినెట్‌ బెర్త్‌ ఆశలుపెట్టుకున్న రాజగోపాల్‌రెడ్డికి రెడ్డి కోటాలో పోస్ట్‌ గ్యారెంటీ అంటూ ప్రచారం సాగింది. కానీ లాస్ట్‌ మినిట్‌లో రంగంలోకి జానారెడ్డి పార్టీ అధిష్టానికి లేఖలు రాశారు. అందులో రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వాలని పేర్కొనడంతో కథ మొదటికొచ్చింది.రంగారెడ్డి జిల్లా నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు రెడ్డి సామజికవర్గానికి చెందిన వారే కావడంతో వారికి అవకాశమిస్తే రాజగోపాల్‌కు నిరాశ తప్పకపోవచ్చన్న ప్రచారం సాగుతోంది.

ఇది కూడా చదవండి: AP Crime: విశాఖలో​ ప్రేమోన్మాది దాడి.. తల్లి కూతురిని చంపిన దుర్మార్గుడు

సీనియర్ల మధ్య సమన్వయలోపం


ప్రభుత్వంలో, పార్టీలో కీలకంగా ఉన్న సీనియర్ల మధ్య కూడా సమన్వయం లోపించినట్లు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణలో ఈసారి ఎలాగైనా తమకు స్థానం కల్పించాల్సిందేనంటూ రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేల పట్టుబడుతున్నారు. వారికి మద్దతునిస్తూ రంగారెడ్డి జిల్లా నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్‌ సీనియర్ నేత జానారెడ్డి.. అధిష్టానానికి లేఖలు కూడా రాశారు. అలాగే చాలామంది ఆశావహులు ఢిల్లీలోనే మకాం వేసి అధిష్టాన్నాన్ని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. లంబాడా యువజన సంఘాల సమాఖ్య నేతలు...రాహుల్ గాంధీని కలిసి తమకు ప్రాతినిధ్యం ఉండాల్సిందేనని డిమాండ్ చేశారు. అటు మాదిగలకు అవకాశం ఇవ్వాల్సిందేనంటూ ఎమ్మార్పీఎస్ డిమాండ్ చేస్తోంది. ఇక జనాభా దామాషా ప్రకారం కేబినెట్‌లో మరో ఇద్దరు మంత్రులకు అవకాశం కల్పించాలని బీసీ నేతలు అంటున్నారు. 

Also Read: Mega 157: తొలి సీన్లోనే అదరగొట్టిన చిరు.. అనిల్ రావిపూడి మూవీ నుంచి అదిరిపోయే వీడియో!

3న విస్తరణ లేనట్టే..

 మరోవైపు తెలంగాణ బీసీ నేతల ధర్నా కార్యక్రమం కూడా విస్తరణకు అడ్డుపడినట్లైంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. సీఎం రేవంత్‌ రెడ్డి సహా తెలంగాణ బీసీ నేతలంతా ఢిల్లీలోనే మకాం వేశారు. దీంతో ఏప్రిల్ 3న కేబినెట్ విస్తరణకు అవకాశం లేదని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా తెలంగాణ కేబినెట్‌ విస్తర‌ణ‌కు నిత్యం ఏదో ఒక గండం అడ్డుపడుతూ వస్తోంది. మొదట లోక్‌సభ ఎన్నికలు.. తర్వాత ఉగాది.. ఇప్పుడు ఏప్రిల్‌ 3.. ఇలా ప్రతిసారి కేబినెట్ విస్తరణ వాయిదా పడుతూనే వస్తుంది. మరీ మళ్లీ కేబినెట్ విస్తరణ ఎప్పుడు ఉంటుంది..? ఎవరీకి పదవులు దక్కుతాయనేది చూడాల్సిందే.

Also Read : German woman: జర్మనీ యువతి రేప్ కేసు.. పోలీసులకు దొరికిన నిందితుడు!
 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori - Sri Varshini: వర్షిణీ వస్తున్నా.. అందరి అంతు తేలుస్తా - అఘోరీ సంచలన వీడియో

తనపై వస్తున్న ఆరోపణలపై క్లారిటీ ఇచ్చేందుకు మళ్లీ తెలుగు రాష్ట్రాలకు వస్తానని అఘోరీ సంచనల వీడియో రిలీజ్ చేసింది. ప్రస్తుతం తాను కాశీలో ఉన్నానని తెలిపింది. తనపై విమర్శలు చేసిన వారెవ్వరినీ వదిలిపెట్టనని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో వైరలవుతోంది.

New Update

అఘోరీ పై వర్షిణీ పేరెంట్స్ తీవ్ర ఆరోపణలు చేశారు. తమ బిడ్డపై అఘోరీ క్షుద్రపూజలు, వశీకరణం జరిపి తనవైపుకు తిప్పుకుందని వారు ఆరోపించారు. మరోవైపు అఘోరీ డబ్బులు ఆశచూపిందని వర్షిణీ అన్న శ్రీవిష్ణు ఇటీవల ఓ వీడియోలో తెలిపారు. అంతేకాకుండా అఘోరీ బ్యాంక్ అకౌంట్లలో లక్షల రూపాయలు ఉన్నాయని.. వారు తెలిపారు. వీటన్నింటిపై అఘోరీ క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు తాను ఈ ఆరోపణలపై క్లారిటీ ఇస్తానని.. తన బ్యాంక్ స్టేట్‌మెంట్ సైతం చూపిస్తానంటూ అఘోరీ ఓ వీడియో రిలీజ్ చేసింది. 

ఇది కూడా చూడండి: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

అఘోరీ సంచలన వీడియో

అఘోరీ రిలీజ్ చేసిన వీడియో ప్రకారం.. ‘‘నేను కాశీలో ఉన్నాను. నాపై చాలా మంది విమర్శలు చేస్తున్నారు. మా సాధన గురించి మీకు ఏం తెలుసని విమర్శలు చేస్తున్నారు. ఒక మనిషిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు.  ఒక సాధకుడ్ని, అఘోరీని హింసిస్తే ఊరుకునేది లేదు. ఎవరెవరు నాపై విమర్శలు.. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారో వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటాను. 

ఇది కూడా చూడండి: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

కాశీ మీద ఒట్టేసి చెబుతున్నా ఎవ్వరినీ వదిలేదు లేదు. నాది ధర్మపోరాటం. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా.. ఎంతమంది అడ్డుకున్నా.. నా పోరాటాన్ని నేను కొనసాగిస్తాను. ఇకనుంచి నా ఉగ్రరూపం చూస్తారు. ఎవ్వరినీ వదిలి పెట్టను. అందరి అంతూ చూస్తాను. నా నుంచి ఎవరూ తప్పించుకోలేరు. నేను ప్రస్తుతం కాశీలో ఉన్నాను. త్వరలోనే తెలంగాణ, ఆంధ్రాకు వస్తాను. ’’ అని తెలిపింది. 

ఇది కూడా చూడండి: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ

ఇది కూడా చూడండి: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి

(aghori | lady aghori | aghori sri varshini | b tech aghori sri varshini | latest-telugu-news | telugu-news | aghori video)

Advertisment
Advertisment
Advertisment