BIG BREAKING: భారీ పేలుడు.. ముగ్గురు జవాన్లు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో భారీ IED పేలుడు సంభవించింది. శనివారం మధ్యాహ్నం ఛోటేబేథియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గరు జవాన్లు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది.
ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో భారీ IED పేలుడు సంభవించింది. శనివారం మధ్యాహ్నం ఛోటేబేథియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గరు జవాన్లు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది.
బీ2 బాంబర్లతో ఇరాన్‌పై దాడి చేసి ఆ దేశం అణ్వాయుధాలు తయారు చేయకుండా అడ్డుకున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. లేకుంటే ఇజ్రాయెల్, పశ్చిమాసియా, యూరప్ దేశాలు ముక్కలై ఉండేవని హెచ్చరించారు.
అమెరికాతో నెలకొన్న ఘర్షణపై తాజాగా ఇరాన్ సైనిధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో మళ్లీ యుద్ధం జరిగే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే ఇరుదేశాల మధ్య శాంతి చర్చలపై అనిశ్చితి కొనసాగుతోంది.
కమర్షియల్ సిలిండర్ ధరలు రూ.993 పెరిగిన సంగతి తెలిసిందే. త్వరలోనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పెట్రోల్, డీజిల్‌పై రూ.4 నుంచి రూ.5 పెంచే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) శనివారం దేశవ్యాప్తంగా మొబైల్ యూజర్ల కోసం 'సెల్ బ్రాడ్కాస్ట్ అలెర్ట్' వ్యవస్థను పరీక్షించనుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, రాజధాని నగరాల్లో ఈ ట్రయల్ రన్ నిర్వహించనున్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షాకింగ్ అప్డేట్ వచ్చింది. ఏప్రిల్ 29న జరిగిన రెండో దశ ఎన్నికల్లో15 పోలింగ్ కేంద్రాల్లో జరిగిన ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది.
అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్కు కాపిటల్ హిల్‌లో కాంగ్రెస్ సభ్యులు ఊహించని ప్రశ్నలు అడిగారు. అధ్యక్షుడు ట్రంప్ మానసిక స్థితి, ఆయన సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్న వివాదాస్పద పోస్టులపై డెమొక్రాట్ ప్రతినిధి సారా జాకబ్స్ ప్రశ్నించారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందే రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్తతలు ముదురుతున్నాయి. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కింగ్ మేకర్‌గా అవతరించే ఛాన్స్ ఉన్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి.
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వేతన ప్యాకేజీ మళ్లీ వార్తల్లో నిలిచింది. 2025 ఆర్థిక సంవత్సరానికి గానూ మస్క్ ఏకంగా 158 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 15 లక్షల కోట్లు) భారీ వేతనాన్ని టెస్లా బోర్డు ప్రకటించింది.