Elon Musk: రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్.. ఏడాదికి రూ.15 లక్షల కోట్ల ప్యాకేజీ

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వేతన ప్యాకేజీ మళ్లీ వార్తల్లో నిలిచింది. 2025 ఆర్థిక సంవత్సరానికి గానూ మస్క్‌ ఏకంగా 158 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 15 లక్షల కోట్లు) భారీ వేతనాన్ని టెస్లా బోర్డు ప్రకటించింది.

New Update
Elon Musk

Elon Musk

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వేతన ప్యాకేజీ మళ్లీ వార్తల్లో నిలిచింది. 2025 ఆర్థిక సంవత్సరానికి గానూ మస్క్‌ ఏకంగా 158 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 15 లక్షల కోట్లు) భారీ వేతనాన్ని టెస్లా బోర్డు ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. సాధారణంగా ఎలాన్ మస్క్ టెస్లా నుంచి ఎలాంటి నెలవారీ జీతం తీసుకోరు. కానీ దీనికి బదులుగా కంపెనీ నిర్దేశించిన కఠినమైన లక్ష్యాలను చేరుకుంటే స్టాక్ ఆప్షన్ల రూపంలో ఈ ప్యాకేజీ అందుతుంది.

Also Read: గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. కమర్షియల్ సిలిండర్ ధర రూ.993 పెంపు

158 బిలియన్ డాలర్ల ప్యాకేజీలో ప్రధానంగా రెండు భాగాలున్నాయి. 132 బిలియన్ డాలర్లు అనేవి కంపెనీ పనితీరు ఆధారంగా పారితోషకాన్ని ఇస్తారు. అంటే టెస్లా మార్కెట్ విలువ పెరగడం, ఇతర ఆర్థిక మైలురాళ్లు చేరుకుంటేనే ఎలాన్‌ మస్క్‌కు ఈ ప్యాకేజీ మొత్తం అందుతుంది. ఇక మిగిలిన 26 బిలియన్ డాలర్లు అనేవి మధ్యంతర అవార్డు రూపంలో కేటాయిస్తారు. వాస్తవానికి  ఈ వేతన ప్యాకేజీ కేవలం కాగితాలపై కనిపిస్తున్న విలువ మాత్రమేనని.. కంపెనీ లక్ష్యాలను చేరుకోకుంటే మస్క్‌కు లభించే వాస్తవ ఆదాయం సున్నాగా మిగిలిపోయే ఛాన్స్ ఉందంటూ టెస్లా తెలిపింది.

Also Read: తాగి అసెంబ్లీకి వచ్చిన పంజాబ్ సీఎం?.. వీడియో వైరల్

 గతేడాది కూడా టెస్లా సంస్థ ఎలాన్ మస్క్‌కు ట్రిలియన్ డాలర్ల భారీ ప్యాకేజీని ప్రకటించింది. కానీ అప్పుడు మార్కెట్ విలువ ఆశించిన స్థాయిలో పెరగలేదు. దీంతో నిర్దేశిత టార్గెట్‌లను టెస్లా చేరుకోలేకపోయింది. చివరికీ మస్క్‌కు ఆ ప్యాకేజీ నుంచి ఒక్క రూపాయి కూడా రాకుండా పోయింది.  2025 ఆర్థిక సంవత్సరం ప్యాకేజీ సైతం అదే తరహాలో పూర్తిస్థాయిలో ఈక్విటీ అవార్డు గ్రాంట్లపై ఆధారపడి ఉంది. దీన్నిబట్టి భవిష్యత్తులో టెస్లా సాధించే వృద్ధిపైనే ఎలాన్ మస్క్ సంపాదన ఆధారపడి ఉంటుంది.

Advertisment
తాజా కథనాలు