వాహనాదారులకు బిగ్ షాక్.. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ?

కమర్షియల్ సిలిండర్‌ ధరలు రూ.993 పెరిగిన సంగతి తెలిసిందే. త్వరలోనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పెట్రోల్, డీజిల్‌పై రూ.4 నుంచి రూ.5 పెంచే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

New Update
petrol, diesel prices likely to hike after polls diesel prices likely to hike after polls

petrol, diesel prices likely to hike after polls

కమర్షియల్ సిలిండర్‌ ధరలు రూ.993 పెరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో కీలక అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. త్వరలోనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పెట్రోల్, డీజిల్‌పై రూ.4 నుంచి రూ.5 పెంచే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఇక డొమెస్టిక్ సిలిండర్‌పై రూ.50 పెరగనున్నట్లు ప్రచారం నడుస్తోంది. వారం రోజుల్లో దీనిపై కేంద్రం నుంచి అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. శుక్రవారం ఒక్కరోజులోనే 19 కేజీల కమర్షియల్ సిలిండర్ రూ.993 పెరగడంతో హైదరాబాద్‌లో దీని ధర ఏకంగా రూ.3,315కు చేరింది.  

Also Read: సంచలన అప్‌డేట్‌.. పశ్చిమ బెంగాల్‌లో మళ్లీ ఎన్నికలు

అంతర్జాతీయ ముడి చమురు మార్కెట్‌లో ఆయిల్ ధర బ్యారెల్‌కు 125 డాలర్లు చేరుకుంది. అధిక ధరలు చమురు కొనుగోలు చేయడం వల్ల ఆయిల్ కంపెనీలు రోజుకు రూ.2 వేల కోట్ల నష్టాన్ని భరిస్తున్నాయి. మరికొన్ని నెలలు లేదా సంవత్సరాల పాటు క్రూడ్ ఆయిల్ సంక్షోభం ఉండే అవకాశం ఉన్నట్లు పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు. చమురు నష్టాలను భర్తీ చేసేందుకే.. ఇంటర్నేషనల్ ధరలకు అనుగుణంగా దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగనున్నాయని వార్తలు వస్తున్నాయి. 

Also Read: హైదరాబాద్‌లో ఇక ఫుడ్ తినాలంటే చుక్కలు కనిపిస్తాయ్.. బాదుడే బాదుడు..!

 తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఆయా రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చాక పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెంచే ఛాన్స్ ఉందని ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు భవిష్యత్తులో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కూడా పెరుగుతాయనే వాదనలను కొట్టిపారేయలేమని కేంద్ర ప్రభుత్వ వర్గాలు సైతం వెల్లడించాయి.

Advertisment
తాజా కథనాలు