/rtv/media/media_files/2026/05/01/trump-2026-05-01-18-42-34.jpg)
Pete Hegseth Asked If Trump Is "Mentally Stable" To Lead US His Reply Is Viral
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్‌కు కాపిటల్ హిల్‌లో కాంగ్రెస్ సభ్యులు ఊహించని ప్రశ్నలు అడిగారు. అధ్యక్షుడు ట్రంప్ మానసిక స్థితి, ఆయన సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్న వివాదాస్పద పోస్టులపై డెమొక్రాట్ ప్రతినిధి సారా జాకబ్స్ ప్రశ్నించారు. "మొత్తం మానవ నాగరికతకే ముప్పు వాటిల్లుతుంది" అంటూ ట్రంప్ చేసిన హెచ్చరికను ప్రస్తావిస్తూ ఆయన కమాండర్-ఇన్-చీఫ్‌గా ఉండేందుకు మానసిక స్థితి బాగుందా అంటూ అడిగారు.
ఈ ప్రశ్నపై పీట్ హెగ్సెత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జో బైడెన్ హయాంలో ఇలాంటి ప్రశ్నలు ఎందుకు అడగలేదంటూ ధ్వజమెత్తారు. దీనిపై స్పందించిన సారా జాకబ్స్.. బైడెన్ ఇప్పుడు అధ్యక్షుడు కాదని.. ట్రంప్ గత ఏడాదిన్నరగా అధికారంలో ఉన్నారంటూ పేర్కొన్నారు. కానీ హెగ్సెత్ మాత్రం తన సమాధానాన్ని సమర్థించుకున్నారు. దేశాధ్యక్షుడిని కించపరిచేలా అడిగే ప్రశ్నలకు తాను సమాధానం చెప్పనన్నారు. ట్రంప్.. సైనికులకు ప్రాధాన్యత ఇచ్చే అద్భుతమైన నాయకుడంటూ ప్రశంసించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
I asked Secretary Hegseth a straightforward, yes or no question today: Is Donald Trump mentally stable enough to be Commander in Chief?
— Congresswoman Sara Jacobs (@RepSaraJacobs) April 29, 2026
He didn't say yes. And that speaks volumes. pic.twitter.com/ncWhEBAX9r
Also Read: విజయ్‌కు బిగ్ షాక్.. TVK పార్టీ ఆఫీసుకు నిప్పు పెట్టిన దుండగులు
ఇదిలాఉండగా 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ట్రంప్ సర్కార్ ప్రతిపాదించిన 1.5 ట్రిలియన్ డాలర్ల రక్షణ బడ్జెట్‌పై కూడా చర్చించారు. ప్రపంచంలోనే అత్యున్నత స్థాయిలో అమెరికా సైన్యాన్ని ఉంచేందుకు ఈ నిధులు అవసరమని హెగ్సెత్ అన్నారు. జూనియర్ సైనికుల వేతనాలు 7 శాతం పెంచడం, సైనిక నివాసాలను అభివృద్ధి చేయడం లాంటి అంశాలపై ఈ బడ్జెట్‌లో ఫోకస్ పెట్టామన్నారు. దేశ భద్రతను, సైనిక సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఇది జనరేషనల్ రీసెట్ లాంటిదని పేర్కొన్నారు.
Also Read: గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. కమర్షియల్ సిలిండర్ ధర రూ.993 పెంపు
మరోవైపు అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో ట్రంప్ చేస్తున్న సోషల్ మీడియా పోస్టులు ఆందోళన రేపుతున్నాయి. అర్ధరాత్రి సమయాల్లో ట్రంప్ చేసిన పోస్టులు ఆయన మానసిక స్థితిపై అనుమానాలు కలిగిస్తున్నాయంటూ విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఇరాన్ మా డిమాండ్లు అంగీకరించకుండే ఆ దేశ నాగరికత ఈ రాత్రికి అంతమవుతుందని ఆయన చేసిన పోస్టు ఇటీవల సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తనను దైవ సమానంగా చూపిస్తూ విడుదలైన ఏఐ చిత్రాలపై కూడా విమర్శలు వచ్చాయి. దీనిపై స్పందించిన ట్రంప్ తాను ప్రజలను బాగుచేసే వైద్యుడిలా ఉన్నాననే ఉద్దేశంతో ఈ ఫొటోలు పెట్టానని తెలిపారు.
Follow Us