BIG BREAKING: రేపు అందరీ ఫోన్‌లకు అలర్ట్‌.. ఆందోళన వద్దు

జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) శనివారం దేశవ్యాప్తంగా మొబైల్ యూజర్ల కోసం 'సెల్ బ్రాడ్‌కాస్ట్ అలెర్ట్' వ్యవస్థను పరీక్షించనుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, రాజధాని నగరాల్లో ఈ ట్రయల్ రన్ నిర్వహించనున్నారు.

New Update
Got an NDMA alert SMS? Don't panic, India is testing new disaster warning system

Got an NDMA alert SMS? Don't panic, India is testing new disaster warning system

జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) శనివారం దేశవ్యాప్తంగా మొబైల్ యూజర్ల కోసం 'సెల్ బ్రాడ్‌కాస్ట్ అలెర్ట్' వ్యవస్థను పరీక్షించనుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, రాజధాని నగరాల్లో ఈ ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. భద్రతా కారణాల వల్ల సరిహద్దు ప్రాంతాలకు, అలాగే ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు ఈ అలెర్ట్ పరీక్ష నుంచి మినహాయించారు. అత్యవసర సమయాల్లో, విపత్తులు జరిగినప్పుడు ప్రజలకు ముందు జాగ్రత్తగా అలెర్ట్‌ చేసేందుకు ఈ సాంకేతికత ఎంత వేగంగా పనిచేస్తుందో తెలుసుకోవడమే ఈ పరీక్ష ఉద్దేశం. 

Also Read: సంచలన అప్‌డేట్‌.. పశ్చిమ బెంగాల్‌లో మళ్లీ ఎన్నికలు

దీన్ని పరీక్షించే సమయంలో అందరీ మొబైల్‌ ఫోన్‌కు గట్టిగా శబ్దం లేదా వైబ్రేషన్‌తో కూడిన ఎమర్జెన్సీ అలర్ట్‌ నోటిఫికేషన్ పంపిస్తారు. దీన్ని చూసి ఎవరూ కూడా ఆందోళన చెందొద్దని.. కేవలం 'సెల్ బ్రాడ్‌కాస్ట్ అలెర్ట్' వ్యవస్థ పనితీరును తనిఖీ చేసేందుకు పంపే డెమో సందేశమని అధికారులు తెలిపారు. ప్రకృతి వైపరిత్యాలు, ఇతర విపత్తులు వచ్చినప్పుడు అతి తక్కువ సమయంలోనే  కావాల్సిన సమాచారాన్ని కోట్లాది మంది ప్రజలకు పంపించేందుకు ఈ సిస్టమ్ ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. 

Also Read: హైదరాబాద్‌లో ఇక ఫుడ్ తినాలంటే చుక్కలు కనిపిస్తాయ్.. బాదుడే బాదుడు..!

Advertisment
తాజా కథనాలు