TVK Vijay: విజయ్‌కు బిగ్ షాక్.. TVK పార్టీ ఆఫీసుకు నిప్పు పెట్టిన దుండగులు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందే రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్తతలు ముదురుతున్నాయి. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కింగ్ మేకర్‌గా అవతరించే ఛాన్స్ ఉన్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి.

New Update
TVK office fired

TVK office fired

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందే రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్తతలు ముదురుతున్నాయి. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కింగ్ మేకర్‌గా అవతరించే ఛాన్స్ ఉన్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. ఇలాంటి తరుణంలో తాజాగా తిరుచిరాపల్లిలో టీవీకే పార్టీ  కార్యాలయానికి గుర్తు తెలియని దుండగలు నిప్పు పెట్టడం కలకలం రేపుతోంది. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. 

Also Read: తమిళనాడు రాజకీయాల్లో సంచలనం.. కింగ్‌ మేకర్‌గా మారనున్న విజయ్..

ఈ ప్రమాదంలో ఓటర్ల జాబితాలు, పార్టీ పత్రాలు, బ్యానర్లు, ప్రచార సామగ్రి పూర్తిగా కాలిపోయినట్లు టీవీకే అభ్యర్థి రమేష్ వాపోయారు. ప్రత్యర్థి పార్టీలు తమ కార్యకర్తలపై దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఆరోపించారు. ఈ మేరకు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. మే 4న నిర్వహించే ఓట్ల లెక్కింపు సమయంలో తమకు కౌంటింగ్ కేంద్రాల వద్ద అదనపు భద్రత కల్పించాలంటూ అధికారులను కోరారు.

మరోవైపు తమిళనాడులో మే 4న వెలువడనున్న ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. చాలావరకు ఎగ్జిట్ పోల్స్ ఈసారి కూడా డీఎంకే కూటమి అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందని వెల్లడించాయి. ఇక 'యాక్సిస్ మై ఇండియా' సర్వే మాత్రం విజయ్ పార్టీకి 98 నుంచి 120 స్థానాలు వచ్చే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఇలాంటి తరుణంలో టీవీకే పార్టీకి అగ్నిప్రమాదం జరగడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో  దుమారం రేపుతోంది.

Also Read: శత్రువుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్న Iran హూట్ టార్పెడో..  నీటి అడుగున బుల్లెట్ వేగంతో అటాక్!

Advertisment
తాజా కథనాలు