Trump: మేము అలా చేయకుంటే ఇజ్రాయెల్, పశ్చిమాసియా, యూరప్‌ ముక్కలయ్యేవి.. ట్రంప్ కీలక ప్రకటన

బీ2 బాంబర్లతో ఇరాన్‌పై దాడి చేసి ఆ దేశం అణ్వాయుధాలు తయారు చేయకుండా అడ్డుకున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. లేకుంటే ఇజ్రాయెల్, పశ్చిమాసియా, యూరప్ దేశాలు ముక్కలై ఉండేవని హెచ్చరించారు. 

New Update
Trump

Trump

ఇరాన్‌పై అమెరికా చేసిన సైనిక చర్యను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి సమర్థించుకున్నారు. ఫ్లోరిడాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన దీని గురించి మాట్లాడారు. బీ2 బాంబర్లతో ఇరాన్‌పై దాడి చేసి ఆ దేశం అణ్వాయుధాలు తయారు చేయకుండా అడ్డుకున్నట్లు పేర్కొన్నారు. ఒకవేళ తాము ఈ చర్యకు పాల్పడి ఉండకపోతే ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని పెంచుకుని ఉండేదన్నారు. ఇజ్రాయెల్, పశ్చిమాసియా, యూరప్ దేశాలు ముక్కలై ఉండేవని హెచ్చరించారు. 

అలాగే తమ సైనిక చర్యల వల్ల ఇరాన్ వైమానిక, నౌకాదళాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని తెలిపారు. ఆ దేశ నాయకత్వం కూడా బలహీనపడ్డట్లు తెలిపారు. ప్రస్తుతం ఇరాన్ పాలకుల మధ్య సమన్వయ లేదన్నారు. అక్కడ నాలుగైదు గ్రూపులు విడిపోయి గందరగోళంలో ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఇరుదేశాల మధ్య శాంతి చర్చలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ఇరాన్ చేసిన ప్రతిపాదనలు సంతృప్తికరంగా లేవన్నారు.  

Also Read: అమెరికాతో మళ్లీ యుద్ధం.. ఇరాన్ సంచలన ప్రకటన

ప్రస్తుతం అంతర్జాతీయంగా పెరుగుతున్న ఇంధన ధరలపై కూడా ట్రంప్ మాట్లాడారు. యుద్ధం వల్ల పెట్రోల్ ధరలు పెరిగిన మాట వాస్తవమేనని అంగీకరించారు. ఘర్షణలు ముగిసిన వెంటనే ధరలు తగ్గుతాయన్నారు. అణ్వాయుధాలు లేని ఇరాన్ ప్రపంచ భద్రతకు కీలకమని తెలిపారు. ఆ దేశానికి అణ్వాయుధ తయారీకి పర్మిషన్ ఇవ్వడం ప్రపంచానికే ప్రమాదకరమన్నారు. యుద్ధం ముగిసిన తర్వాత సురక్షితమైన పశ్చిమాసియాను చూస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరోవైపు యుద్ధం కొనసాగించడంపై  అమెరికా పార్లమెంటు (కాంగ్రెస్) నుంచి 60 రోజుల్లోపు పర్మిషన్ తీసుకోవాలన్న రూల్‌పై ట్రంప్ మండిపడ్డారు. ఈ నిబంధనను తెపైకి తీసుకొస్తున్న డెమోక్రాట్లు దేశభక్తులు కాదంటూ తీవ్రంగా విమర్శలు చేశారు. దీనికి ముందు ఇరాన్‌తో యుద్ధం ముగిసిందని కూడా ట్రంప్‌ కాంగ్రెస్‌కు తెలిపారు. యుద్ధంపై ట్రంప్ చేస్తున్న భిన్నమైన ప్రకటనలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతున్నాయి.  

Also Read: మరో షాకిచ్చిన ట్రంప్.. ఆ దేశం నుంచి 5 వేల మంది సైనికులు ఔట్.. కారణం అదేనా?

Advertisment
తాజా కథనాలు