/rtv/media/media_files/2026/05/02/iran-claims-war-with-us-will-likely-to-resume-2026-05-02-14-38-09.jpg)
Iran claims War with US will likely to resume
అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గడం లేదు. ఈ క్రమంలోనే అమెరికాతో నెలకొన్న ఘర్షణపై తాజాగా ఇరాన్ సైనిధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో మళ్లీ యుద్ధం జరిగే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే ఇరుదేశాల మధ్య శాంతి చర్చలపై అనిశ్చితి కొనసాగుతోంది. దీంతో ఇరాన్ ఒప్పందం కోసం తాజాగా పంపిన ప్రతిపాదనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
Also Read: మరో షాకిచ్చిన ట్రంప్.. ఆ దేశం నుంచి 5 వేల మంది సైనికులు ఔట్.. కారణం అదేనా?
ఈ నేపథ్యంలోనే ఇరాన్ సైనిక ప్రధాన కార్యాలయ డిప్యూటీ అధికారి మహమ్మద్ జాఫర్ అసదీ దీనిగురించి మాట్లాడారు. చమురు ధరలు తగ్గించడం కోసం, తాము సృష్టించుకున్న గందరగోళం నుంచి బయటపడేలా అమెరికా అధికారులు ప్రకటనలు ఉన్నాయని విమర్శలు చేశారు. అందుకే అమెరికా-ఇజ్రాయెల్ తమపై మళ్లీ దాడులు చేసే ఛాన్స్ ఉందన్నారు. శత్రు దేశాలు చేసే దాడులను ఎదుర్కునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించారు.
Also Read: హర్మూజ్‌పై నియంత్రణకు కొత్త నిబంధనలు... ఇరాన్ సంచలన నిర్ణయం
మరోవైపు హర్మూజ్ జలసంధిలో ప్రయాణించే నౌకల నుంచి ఇరాన్ టోల్ వసూలు చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా అమెరికా ట్రెజరీ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ విధించే టోల్‌ను చెల్లిస్తే షిప్పింగ్ సంస్థలు ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరికలు చేసింది. దీంతో టోల్ చెల్లింపులతో పాటు ఇరాన్ సైన్యానికి సపోర్ట్ ఇచ్చే వాళ్లపై కూడా చర్యలు తీసుకునేందుకు వెనక్కి తగ్గమని తేల్చిచెప్పింది.
Follow Us