BIG BREAKING: భారీ పేలుడు.. ముగ్గురు జవాన్లు మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో భారీ IED పేలుడు సంభవించింది. శనివారం మధ్యాహ్నం ఛోటేబేథియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గరు జవాన్లు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది.

New Update
IED Blast

IED Blast

ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో భారీ IED పేలుడు సంభవించింది. శనివారం మధ్యాహ్నం ఛోటేబేథియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గరు జవాన్లు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. కాంకేర్-నారాయణపూర్ జిల్లాల సరిహద్దులో మావోయిస్టులు అమర్చిన మందుపాతరలను తొలగిస్తుండగా ఒక్కసారిగా భారీ ఐఈడీ పేలింది. ఈ ప్రమాదంలో ముగ్గరు DRG జవాన్లు తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరరికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఆయన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మార్చి 31న ఛత్తీస్‌గఢ్‌ను మావోయిస్టు ముక్త్‌ రాష్ట్రంగా అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలా ప్రకటించిన తర్వాత ఇదే మొదటి పేలుడు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.  

Also Read: విజయ్ పార్టీకి 121 సీట్లు.. 41% ఓట్లు.. మరో సంచలన సర్వే

మరోవైపు బస్తర్‌ ప్రాంతంలోని దశాబ్దాలుగా అడవుల్లో నక్సలైట్లు పెద్ద ఎత్తున మందుపాతరలు పాతిపెట్టారు. అయితే గత నెలలోనే ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని నక్సల్‌ రహితంగా ప్రకటించింది. కానీ భూమిలో పూడ్చిపెట్టిన ఈ పేలుడు పదార్థాలు మాత్రం భద్రతా బలగాలు, స్థానికులకు సవాలుగా మారుతున్నాయి. అందుకే అటవీ ప్రాంతాల్లో ఉన్న బాంబులు గుర్తించి, వాటిని నిర్వీర్యం చేసేందుకు భద్రతా బలగాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజా పేలుడు ఘటన విషాదం నింపింది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. 

Also Read: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. కౌంటింగ్ వేళ సుప్రీం సంచలన తీర్పు!

Advertisment
తాజా కథనాలు