/rtv/media/media_files/2025/02/11/Jp9TldsrLWj1TUDbr0AY.jpg)
hydrogen train Photograph: (hydrogen train)
ఇండియన్ రైల్వేస్ కొత్త టెక్నాలజీని అందిపుచ్చకుంటోంది. ఇటీవల వందే భారత్ రైళ్లు ప్రవేశపెట్టిన భారత్.. తాజాగా మరో కొత్త టెక్నాలజీతో భారతీయ రైల్వే సంస్థ ముందుకు వస్తోంది. సరికొత్తగా హైడ్రోజన్ రైళ్లపై దృష్టి సారించింది. ఇండియా త్వరలోనే తొలిసారిగా హైడ్రోజన్ రైలును అందుబాటులోకి తీసుకురానుంది. హైడ్రోజన్ రైలు స్టేటస్‌పై మంగళవారం ఎంపీ అజిత్ కుమార్ భూయాన్ అడిగిన ప్రశ్నకు ఆయన రైల్వే మంత్రి సమాధానం ఇచ్చారు. ఆ రైలు ప్రత్యేకతలు, ఫీచర్స్‌ను కేంద్ర రైల్వేశాఖ మంత్రి వివరించారు.
🚆 Bharat’s Hydrogen train - 1200 HP capacity.
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) January 9, 2025
Developed by our engineers, our talent. pic.twitter.com/X5YMO0zHdz
ప్రస్తుతం హైడ్రోజన్ రైలును చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హైడ్రోజన్ రైళ్ల ఇంజిన్లు 600 హార్స్‌పవర్ వరకే ఉత్పత్తి చేస్తుండగా.. భారత తయారు చేసే హైడ్రోజన్ రైలు మాత్రం 1200 హార్స్‌పవర్ వరకు శక్తిని ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉందని ఆయన చెప్పారు. ప్రపంచంలోనే ఈ రైలు అత్యంత పొడవుగా ఉంటుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభలో ప్రకటించారు. అంతేకాదు ట్రైన్ తయారీలో డెవలప్‌డ్ టెక్నాలజీ వాడుతున్నట్లు తెలిపారు. భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలును జింద్, సోనెపట్ సెక్షన్‌లోని 89 కిలోమీటర్ల మార్గంలో ట్రయల్ రన్ నిర్వహిస్తారు.
India’s hydrogen fuel train engine, developed by Indian Railways, boasts 1,200 horsepower, the highest globally in its category, surpassing the 500-600 horsepower engines of other nations.
— 🇮🇳 Amαr (@Amarrrrz) January 11, 2025
Trial runs are set for Haryana, with potential for broader applications in green… pic.twitter.com/jo5Arl05o3
Also Read: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. టెన్త్ అర్హతతో 21413 పోస్టల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్!
ఇప్పటివరకు కేవలం నాలుగు దేశాలు మాత్రమే హైడ్రోజన్ రైళ్లను ప్రారంభించాయి. ఈ ట్రైన్ భారత్‌లో పరుగులు పెడితే.. హైడ్రోజన్ రైలును అభివృద్ధి చేసిన 5వ దేశంగా ఇండియా నిలువనుంది. డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ హైడ్రోజన్ ఇంధన కణాల రెట్రోఫిట్మెంట్ ద్వారా ఈ రైలును తయారు చేస్తోంది. రైల్వే రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ఈ రైలు ప్రత్యేకతలను సిద్ధం చేసింది. రైలుతో పాటు హైడ్రోజన్‌ను తిరిగి నింపేందుకు ఇంటిగ్రేటెడ్ హైడ్రోజన్ ఉత్పత్తి, నిల్వ, పంపిణీ సౌకర్యాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు అవసరమైన ఆమోదం కోసం పెట్రోలియం, పేలుడు పదార్థాల భద్రతా సంస్థను అభ్యర్థించినట్లు తెలిపారు. ప్రత్యామ్నాయ ఇంధన వనరులైన క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు భారతీయ రైల్వే తీసుకున్న చొరవని అశ్విన్ వైష్ణవ్ అన్నారు.