New Income Tax Bill: ట్యాక్స్ కట్టేవాళ్లకి గుడ్‌న్యూస్.. కొత్త IT చట్టంలో ఏముందంటే..!

కేంద్రం 1961 నాటి ఇన్‌కం ట్యాక్స్‌ స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొస్తోంది. గురువారం పార్లమెంట్‌లో దాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇందులో 536 సెక్షన్లు, 23 చాప్టర్లు 622 పేజీల్లో పొందుపరిచారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కం ట్యాక్స్ యాక్ట్ అమలులోకి రానుంది.

author-image
By K Mohan
New Update
New Income Tax Bill

New Income Tax Bill Photograph: (New Income Tax Bill)

New Income Tax Bill: ఇండియన్ ఇన్‌కం ట్యాక్స్ విధానం గజిబిజిగా ఉంటుంది. పన్నుల పద్దులు ఎవరికీ అంత ఈజీగా అర్థం కావు. ప్రస్తుతం అమలులో ఉన్న ఆదాయ పన్ను చట్టం 1961 నాటిది. కేంద్ర ప్రభుత్వం దీని ప్లేస్‌లో మరో ఇన్‌కం ట్యాక్స్ విధానాన్ని తీసుకొస్తోంది. ఫిబ్రవరి 12న కొత్త ఆదాయపు పన్ను బిల్లు పార్లమెంటులో త్వరలో ప్రవేశపెట్టనున్నారు. ఇందులో 536 సెక్షన్లు, 23 చాప్టర్లు ఆదాయ పన్ను గురించి చేసిన చట్టాలు 622 పేజీల్లో పొందుపరిచారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కం ట్యాక్స్ యాక్ట్ అమలులోకి రానుంది. దీంతో ట్యాక్స్ విధానం సులభతరం కానుంది.

Also Read: TTD: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇకపై వాట్సాప్‌లోనే

ఈ ఏడాది ఆర్థిక సంవత్సంలో భారీగా మార్పులు రానున్నాయి. ఇందులో డిజిటల్ ట్యాక్స్ మానిటరింగ్ సిస్టమ్ ప్రవేశపెట్టారు. ఆదాయ పన్ను కొత్త చట్టం బిల్లులో ప్రతిపాదించిన కీలక మార్పుల్లో  ట్యాక్స్‌ ఇయర్‌ ఒకటని సమాచారం. ఈ మార్పువల్ల వ్యాపారుల పన్ను చెల్లింపులను సులభతరం చేసేందుకు వీలవుతుందని భావిస్తున్నారు. తరచూ శాసన పరమైన సవరణలు అవసరం లేకుండా పన్ను పథకాలను ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ)కి ఎక్కువ అధికారాన్ని ఈ బిల్లు కల్పిస్తుంది.

ట్యాక్స్ ఇయర్ అంటే ఏమిటి?

ట్యాక్స్‌ను లెక్కించే సంవత్సరం(12 నెలల) కాలాన్ని ట్యాక్స్ ఇయర్ అంటారు. కొత్త ఆదాయపు పన్ను బిల్లు ప్రకారం ట్యాక్స్‌ ఇయర్‌ ఏప్రిల్ 1న ప్రారంభమై మరుసటి ఏడాది మార్చి 31న ముగుస్తుంది. 1961 ఆదాయపు పన్ను చట్టంలో ఉపయోగించిన  ప్రివియస్‌ ఇయర్‌, అసెస్‌మెంట్‌ ఇయర్‌ స్థానంలో ఈ ట్యాక్స్‌ ఇయర్‌ను వాడనున్నారు.

Also Read: Trump-musk: మస్క్‌ కు హై పవర్‌ ఇచ్చిన ట్రంప్‌...ఇక కోతలే..కోతలు!

పన్ను చట్టాలు సులభతరం ఇలా..

స్థిరమైన ట్యాక్స్‌ ఇయర్‌ను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా పన్ను చెల్లింపుదారులు ఆదాయాన్ని నివేదించడానికి, పన్నులు చెల్లించడానికి నిర్దిష్ట వ్యవధిని కలిగి ఉంటారు. ఇది విభిన్న ఆర్థిక సంవత్సరాలకు వేర్వేరు అసెస్‌మెంట్‌ ఇయర్‌( ప్రివియస్ ఇయర్ - వచ్చే ఆర్థిక సంవత్సరం)లను కలిగి ఉండటం వల్ల తలెత్తే గందరగోళాన్ని తొలగిస్తుంది. పన్ను చెల్లింపుదారులు తమ బాధ్యతలను అర్థం చేసుకోవడానికి సులభమైన, స్పష్టమైన భాషను ఉపయోగించాలని కొత్త బిల్లు లక్ష్యంగా పెట్టుకుంది. ఏళ్ల తరబడి పేరుకుపోయిన కాలం చెల్లిన నిబంధనలు, వివరణలను తొలగించాలని నిర్ణయించారు. పన్ను విధానాలకు సంబంధించి స్పష్టమైన నిర్వచనాలు, క్రమబద్ధమైన విధానాతతో కొత్త పన్ను చట్టాలు వివాదాలు, లిటిగేషన్లను తగ్గిస్తాయని భావిస్తున్నారు. దీనివల్ల మరింత పన్ను వసూలుకు వీలవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పన్నుకు సంబంధించి వివాదాలు తగ్గడం వల్ల న్యాయవ్యవస్థపై భారం తగ్గుతుందని చెబుతున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

Terrorists arrests: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

మణిపూర్‌లో సైన్యం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. అందులో పలువురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వారినుంచి భారీగా ఆయుధాలు, పేలుడు సామాగ్రి స్వాధీనం చేస్తున్నారు. బిష్ణుపూర్ జిల్లా నింగ్‌థౌఖోంగ్‌, కాక్చింగ్ జిల్లా హియాంగ్లాంలో టెర్రరిస్టులు పట్టుబడ్డారు.

New Update
terrorist arrest

terrorist arrest Photograph: (terrorist arrest)

భద్రతా దళాలు మణిపూర్‌లో వరుసగా సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించాయి. అందులో నిషేధిత తిరుగుబాటు గ్రూపులకు చెందిన అనేక మంది ఉగ్రవాదులను అరెస్టు చేశారు. అలాగే వారు వద్ద నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. బిష్ణుపూర్ జిల్లాలోని నింగ్‌థౌఖోంగ్‌లో ఆదివారం ఓ టెర్రరిస్ట్ గ్రూప్ సభ్యున్ని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి ధృవీకరించారు. తిరుగుబాటు కార్యకలాపాలలో పాల్గొన్న మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కాక్చింగ్ జిల్లాలోని హియాంగ్లాంలో భద్రతా దళాలు సోదాలు నిర్వహించి యునైటెడ్ పీపుల్స్ పార్టీ ఆఫ్ కాంగ్లీపాక్ సభ్యుడిని అరెస్టు చేశాయి.

Also read: Hunger strike: 131 రోజుల నిరాహార దీక్ష విరమించిన రైతు ఉద్యమ నాయకుడు

Also read: Rameswaram: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

బిష్ణుపూర్ జిల్లాలోని లైషోయ్ హిల్స్ ప్రాంతంలో జరిగిన సోదాల్లో భద్రతా దళాలు భారీగా ఆయుధాలు, పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. ఒక SLR రైఫిల్‌తో కూడిన మ్యాగజైన్, ఒక కార్బైన్ మెషిన్ గన్, ఒక .303 రైఫిల్, ఒక డబుల్ బ్యారెల్ గన్, 48 రౌండ్ల మందుగుండు సామగ్రి, 2 గ్రెనేడ్లు, 2 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇతర వస్తువులు ఉన్నాయి. శనివారం జిరిబామ్ జిల్లాలో జరిగిన ప్రత్యేక ఆపరేషన్‌లో పోలీసులు భారీగా గన్స్ గుర్తించారు. శుక్రవారం తెల్లవారుజామున, బిష్ణుపూర్, తౌబాల్ మరియు తూర్పు ఇంఫాల్ సహా వివిధ జిల్లాల నుండి 2 నిషేధిత సంస్థలు- యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (UNLF), కాంగ్లీపాక్ కమ్యూనిస్ట్ పార్టీ (PWG)లకు చెందిన నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు పట్టుకున్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు