🔴Live Breakings: అయ్యో బెలూన్‌తో ఆడుతుండగా.. మహారాష్ట్రలో ప్రమాదవశాత్తు చిన్నారి మృతి

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

  • Mar 28, 2025 20:49 IST

    Telangana: పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేం.. కేంద్రం సంచలన ప్రకటన

    పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం కుదరదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. కృష్ణానదీ జలాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య వివాదం కోర్టులో ఉందని తెలిపింది. అందుకే జాతీయ హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర జల్‌శక్తి శాఖ స్పష్టం చేసింది.

    Palamuru Ethipotala Project
    Palamuru Ethipotala Project

     



  • Mar 28, 2025 20:48 IST

    Paster Praveen: ప్రవీణ్‌ హత్యకు రూ.5 కోట్లే కారణం? సయ్యద్ హుస్సేనీ సంచలనం!

    పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో సంచలనాలు బయటకొచ్చాయి. రూ.5 కోట్లతో రాజమండ్రిలో ప్రవీణ్ బైబిల్ కాలేజీ కడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ 5 కోట్లు ఏమయ్యాయి? ఆ డబ్బుల కోసమే ప్రవీణ్ హత్య జరిగి ఉండొచ్చంటూ సయ్యద్ సమీ హుస్సేనీ సంచలన ఆరోపణలు చేశారు. 

    praveen case
    praveen case Photograph: (praveen case)

     



  • Mar 28, 2025 20:47 IST

    CSK Vs RCB: చెయ్యి కాదు మిషన్.. రెప్పపాటులో ధోనీ అద్భుత స్టంపింగ్‌.. వీడియో చూశారా?

    చెన్నై VS బెంగళూరు మద్య మ్యాచ్‌లో ధోనీ మెరాకిల్ స్టంపింగ్‌ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. RCB ఓపెనర్ పిల్ సాల్ట్ స్ట్రైక్‌ చేస్తుండగా ఫ్రంట్‌కు వెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ ధోని అతడికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. మెరుపు స్టంపింగ్‌తో సాల్ట్‌ను ఔట్ చేశాడు.

    MS Dhoni magic stumping dismissed Phil Salt off Noor Ahmed



  • Mar 28, 2025 10:10 IST

    అయ్యో బెలూన్‌తో ఆడుతుండగా.. మహారాష్ట్రలో ప్రమాదవశాత్తు చిన్నారి మృతి

    బెలూన్ ఊదుతుండగా పేలిపోయి 8 ఏళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. బెలూన్ పేలిపోయి చిన్న ముక్కలు గొంతులోకి వెళ్లడంతో స్పృహతప్పి పడిపోయింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లేలోగా ఆ చిన్నారి మృతి చెందింది.

    Girl dead Balloon
    Girl dead Balloon Photograph: (Girl dead Balloon)

     



  • Mar 28, 2025 10:09 IST

    వరంగల్‌లో భయం భయం.. చెడ్డీ గ్యాంగ్‌ హల్‌చల్

    ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ చోరీలతో రెచ్చిపోతున్నారు. హన్మకొండలో తాళం వేసిన ఇంట్లో రాత్రి దొంగతనానికి పాల్పడ్డారు. సీసీ టీవీలో దొంగతనం దృశ్యాలు రికార్డైంది. నెల రోజుల్లో 9 చోట్ల దొంగతనాలు చేసినట్లు తెలుస్తోంది.

    cheddy gang
    cheddy gang

     



  • Mar 28, 2025 10:08 IST

    ఉక్రెయిన్‌ ప్రభుత్వం మారితే కనుక.. యుద్దాన్ని ఆపేస్తాం!

    ఉక్రెయిన్‌-రష్యా మధ్య యుద్ధం ముగించేందుకు అమెరికా మధ్యవర్తిత్వంతో చర్చలు జరుగుతున్నాయి.ఈ పరిణామాల వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.జెలెన్ స్కీ ప్రభుత్వం మారితే యుద్ధాన్ని ఆపేస్తామని ప్రకటించారు.



  • Mar 28, 2025 10:08 IST

    ‘మీ అమ్మాయిని చంపి సూట్‌కేస్‌లో పెట్టిన’ అత్తమామలకు ఫోన్ చేసి చెప్పిన అల్లుడు

    రాకేష్ భార్య గౌరీని మార్చి 26న హత్య చేసి సూట్‌కేసు‌లో పెట్టి పారిపోయాడు. తర్వాత అత్తమామలకు ఫోన్ చేసి భర్యను హత్య చేసినట్లు చెప్పాడు. ఈఘటన బెంగుళూర్‌ హులిమావు పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

    man murder wife
    man murder wife Photograph: (man murder wife)

     



  • Mar 28, 2025 08:11 IST

    కొంపముంచిన డ్రగ్స్ అలవాటు.. ఒకేసారి 10 మంది ఎయిడ్స్

    కేరళ మలప్పురం జిల్లాలోని వాలంచెరి మున్సిపాలిటీ ప్రాంతంలో ఒకేసారి 10 మందికి హెచ్ఐవీ పాజిటివ్ ఉన్నట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు నిర్ధారించారు. అయితే ఆ 10 మంది వ్యక్తులు ఒకే సూది ఇంజెక్షన్ వాడినట్లు అధికారులు తెలిపారు.

    AIDS with drugs
    AIDS with drugs Photograph: (AIDS with drugs)

     



  • Mar 28, 2025 08:10 IST

    కసాయి తల్లి.. కన్న బిడ్డను చంపి ప్రమాదంగా చిత్రీకరణ

    హైదరాబాద్‌లో రెండు రోజుల క్రితం14 రోజుల పాప అనుమానాస్పద మృతిని పోలీసులు ఛేదించారు. ఆ పాప చంపింది తల్లిదండ్రులేనని తేల్చారు. బిడ్డను బకెట్‌లో ముంచి ఊపిరి తీసినట్లు నిర్ధారించారు. తల్లిదండ్రులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



  • Mar 28, 2025 08:10 IST

    కామారెడ్డి జిల్లాలో దారుణం.. బాకీ అడిగితే కట్టేసి కిరాతంగా దాడి

    కామారెడ్డిలో రమేష్ అనే వ్యక్తి పోచయ్యకు కారును విక్రయించాడు. ఈఎంఐ కట్టే విధంగా ఒప్పందం చేసుకున్నారు. కానీ డబ్బులు కట్టకపోవడంతో రమేష్ కారును తీసుకురావడానికి ప్రయత్నించాడు. దీంతో పోచయ్య తన అల్లుడితో కలిసి స్తంభానికి కట్టేసి కొట్టడంతో రమేష్ మృతి చెందాడు.



  • Mar 28, 2025 08:10 IST

    అన్నంలో విషం కలిపిపెట్టిన తల్లి.. నిద్రలోనే ముగ్గురు చిన్నారులు మృతి

    సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తల్లి పిల్లలకు తినే అన్నంలో విషం కలిపి పెట్టింది. నిద్రలోనే ముగ్గురు పిల్లలు చనిపోయారు. తర్వాత ఆమె కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. పిల్లల్ని చంపడానికి గల కారణం తెలియాల్సిఉంది.



  • Mar 28, 2025 08:09 IST

    ఏఐ వచ్చినా..ఆ ఉద్యోగాలకు మాత్రం ఢోకా లేదు: బిల్‌ గేట్స్‌!

    ఏఐ ధాటికి తట్టుకుని మూడు వృత్తులు నిలబడతాయని బిల్‌గేట్స్‌ అన్నారు. కోడింగ్‌, ఎనర్జీ మేనేజ్‌మెంట్‌,బయాలజీ రంగాలు దీనిని తట్టుకొని నిలబడతాయని చెప్పారు.సృజనాత్మకత, పరిస్థితులకు తగ్గట్టుగా సామర్థ్యాన్ని మెరుగుపర్చుకునే లక్షణాన్ని ఏఐ సొంతం చేసుకోలేదన్నారు.

    billgates
    billgates

     



  • Mar 28, 2025 08:08 IST

    ఇండియా అలాంటి వారికి ధర్మసత్రం కాదన్న అమిత్ షా

    కేంద్ర హోం మంత్రి అమిత్ షా భారత దేశం చొరబాటుదారులకు ధర్మసత్రం కాదని అన్నారు. లోక్‌సభలో గురువారం మ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు 2025 కు సభ్యులు అమోదం తెలిపారు. దేశాభివృద్ధికి తోడ్పడే వలసలను మాత్రమే మా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని అమిత్ షా అన్నారు.

    immigration bill 2025
    immigration bill 2025 Photograph: (immigration bill 2025)

     



  • Mar 28, 2025 08:08 IST

    మరో బాంబ్ పేల్చిన ట్రంప్.. బంగారం ధరల్లో ఊహించని మార్పు..!

    ట్రంప్ కొత్త సుంకాల నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. కిందటి సెషన్లో 3020 డాలర్ల స్థాయిలో ఉండగా.. ఒక్కరోజే ఒక శాతానికి పెరిగింది.గోల్డ్ రేటు 31.10 గ్రాములకు 3059 డాలర్ల మార్కు వద్ద రికార్డు గరిష్టాల్ని చేరుకుంది

    trumpgold
    trumpgold

     



  • Mar 28, 2025 08:07 IST

    అమెరికా నుంచి సాయం ఆగిపోతే కనుక ...10 లక్షల మరణాలు !



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు