Mail Inbox: ఈమెయిల్ ఇన్‌బాక్స్‌లో వేలకొలది మెసేజెస్ పేరుకుపోతే ఏమవుతుందో తెలుసా? ఈమెయిల్ మెసేజెస్ తో ఇన్‌బాక్స్ నిండిపోవడం చాలామందికి జరుగుతుంది. దీనివలన చాలా నష్టాలు ఉన్నాయని ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ జర్నల్ చేసిన సర్వేలో తేలింది. ఇన్‌బాక్స్ లో వెలది మెసేజెస్ ఉంటే ఏమవుతుంది? వాటిని మేనేజ్ చేయడం ఎలా? టైటిల్ పై క్లిక్ చేసి ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By KVD Varma 19 Mar 2024 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి Mail Inbox: ఒకప్పుడు ఏదైనా సమాచారమా ఒకరి నుంచి ఒకరికి చేరాలంటే.. ఉత్తరాలే గతి. ఒక ఊరి నుంచి ఒక ఊరికి ఉత్తరం చేరాలంటే చాలా సమయం పట్టేది. ఒక్కోసారి జబ్బుతో ఒక వ్యక్తి ఉన్నారని ఉత్తరం రాస్తే అది అవతల వారికి చేరేసరికి ఈ జబ్బు పడ్డ మనిషి చనిపోవడం జరిగేది. ఇప్పుడు పారిస్తాయి మారింది అత్యంత వేగంగా.. ఇంకా చెప్పాలంటే సెకనులో పదో వంతు సమయంలో ఏ సమాచారమైన దూరంతో పని లేకుండా చేరిపోతోంది. ఈమెయిల్ ఇప్పుడు మన జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. బ్యాంక్ ఎకౌంట్ స్టేట్మెంట్ నుంచి.. జాబ్ కాల్ లెటర్.. అపాయింట్మెంట్ లెటర్ ఇలా ఏదైనా సరే ఈ మెయిల్ ద్వారానే మనల్ని చేరుతుంది. అయితే, చాలామంది ఈమెయిల్ ఇన్‌బాక్స్ విషయంలో చాలా అశ్రద్ధగా ఉంటారు. దీంతో వేలకొలది మెయిల్స్ తో ఇన్‌బాక్స్(Mail Inbox) నిండిపోతుంది. అయినా, ఎవరూ పట్టించుకోరు. కారణం ఏదైనా ఇలా ఈ మెయిల్ ఇన్‌బాక్స్ నిండిపోవడం వలన చాలా నష్టం ఉంటుంది. ఈమెయిల్స్ కి సంబంధించి ఇటీవల ఒక సంస్థ జరిపిన సర్వేలో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడి అయ్యాయి. ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ జర్నల్ లో ఈ విషయాలను వెల్లడించారు. అలా మెయిల్ బాక్స్ (Mail Inbox)నిండిపోవడం వలన బిల్లులు, ఆన్‌లైన్ సబ్‌స్క్రిప్షన్‌లు, ఎకౌంట్ స్టేట్మెంట్స్ వంటివి ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు అని అడిగిన ప్రశ్నకు కనబడినపుడు చూస్తున్నాం.. లేకపోతె మిస్ అవుతున్నాం. ఒక్కోసారి అలా మెయిల్ వచ్చింది నాయి తెలిసినపుడు ఇన్‌బాక్స్ లో సెర్చ్ చేసి కావలసిన మెయిల్ తీసుకుంటున్నాం అని సమాధానం చెప్పారు. Also Read: డెంగీకి సింగిల్ డోస్ టీకా.. త్వరలోనే.. అంటే, ఈ సర్వే ప్రకారం ఇన్‌బాక్స్(Mail Inbox)ను అస్తవ్యస్తంగా ఉంచడం వల్ల బిల్లులు తప్పిపోవడం అలాగే ముఖ్యమైన కరస్పాండెన్స్‌ను కోల్పోవడం వంటి సమస్యలకు దారితీసినట్టు ఎక్కువమంది స్పష్టం చేశారు. అలాగే వాహనాలకు సంబంధించి ఇన్సూరెన్స్ రెన్యూవల్, రిజిస్ట్రేషన్ కి సంబంధించిన ముఖ్యసమాచారం, పనికిరాని సబ్స్క్రిప్షన్స్ క్యాన్సిల్ చేయడం వంటి వాటిని మిస్ కావడం జరుగుతుంది. ఇలా మిస్ కావడం వలన ప్రతిసంవత్సరం కొంతమంది విపరీతంగా డబ్బును లేట్ ఫీజ్ లేదా జరిమానాలు రూపంలో వదుల్చుకుంటున్నట్టు సర్వ్ తేల్చి చెప్పింది. ఈ మెయిల్ ఇన్‌బాక్స్ ఎలా మెయింటెయిన్ చెయ్యాలి? కనీసం, రెండురోజులు ఒకసారి అయినా మీ ఈ మెయిల్స్ చెక్ చేసుకోవాలి. వీలైనంత వరకూ మెయిల్ వస్తే మీకు తెలిసేలా నోటిఫికేషన్ వచ్చేటట్టు ఏర్పాటు చేసుకోవడం మంచిది. నోటిఫికేషన్ వచ్చిన తరువాత అది ముఖ్యమైన మెయిల్ అయితే కనుక వెంటనే దానిని ఇన్‌బాక్స్(Mail Inbox) నుంచి ప్రత్యేక ఫోల్డర్ లోకి ట్రాన్స్ ఫర్ చేసుకోవాలి. ఈ మెయిల్ ఎకౌంట్ లో ప్రత్యేకంగా ఫోల్డర్లు క్రియేట్ చేసిపెట్టుకోవాలి. అఫీషియల్, బ్యాంక్, గవర్నమెంట్, పర్సనల్ ఇలా మీ అవసరాలకు తగిన విధంగా ఫోల్డర్లు క్రియేట్ చేసుకుని.. మెయిల్ వచ్చినపుడు సంబంధిత ఫోల్డర్ కి దానిని ట్రాస్ఫర్ చేసుకోవాలి. ప్రత్యేకంగా వారానికి ఒక రోజు మీ మెయిల్స్ అన్నిటినీ చెక్ చేసి పనికిరాని వాటిని డిలీట్ చేసేసుకోవాలి. అలాగే, స్పామ్ ఫోల్డర్ చెక్ చేసి స్పామ్ మెయిల్స్ లో పనికి రానివి వెంటనే డిలీట్ చేయాలి. ఒక్కోసారి అవసరమైన మెయిల్స్(Mail Inbox) కూడా పొరపాటున స్పామ్ లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అందువల్ల డిలీట్ చేసే ముందు ఆ మెయిల్ సబ్జెక్టు చెక్ చేసి తరువాత డిలీట్ చేసుకోవాలి. ఈమెయిల్ ఇన్‌బాక్స్(Mail Inbox) అనేది క్లీన్ గా లేకపోతే.. అత్యవసర మెసేజెస్ మిస్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అంతేకాదు, ఒక్కోసారి ఇన్‌బాక్స్ నిండిపోయి.. కొన్ని మెయిల్స్ ఖాళీ చేయాలనీ సూచన వచ్చినపుడు ఇన్‌బాక్స్ ఖాళీలేదు అనే తొందరలో అవసరమైన మెసేజెస్ కూడా డిలీట్ చేసేయడం జరగవచ్చు. అందువల్ల ఎప్పటికప్పుడు మీ మెయిల్ ఇన్‌బాక్స్ మీద ఓ కన్నేసి ఉంచాలి. #e-mail #inbox మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి