/rtv/media/media_files/2025/02/20/y6SAMm9VUaE4DRKdVx8E.jpg)
Uber Photograph: (Uber)
Uber Updates: ర్యాపిడో(Rapido), ఓలా(Ola), ఉబర్(Uber) వంటి సర్వీసులను చాలా మంది ఉపయోగిస్తుంటారు. వీటి సర్వీసులు ఎక్కువగా పట్టణాల్లో మాత్రమే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఎక్కడికైనా వెళ్లాలంటే వీటిలో ఏదో ఒక సర్వీసును వాడుతుంటారు. అయితే వీటిలో డిజిటల్ చెల్లింపులు(Digital Payments) ఉంటాయి. అయితే ఓలా, ర్యాపిడోలు డ్రైవర్లకు డైరెక్ట్‌గా పేమెంట్ చేయవచ్చు. కానీ ఉబర్‌లో మాత్రం ఉబర్ క్రెడిట్ అకౌంట్లకు(Uber Credit Accounts) చేయాలి. దీంతో డ్రైవర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనికోసం ఉబర్ సరికొత్త సర్వీస్‌ను తీసుకొచ్చింది.
ఇది కూడా చూడండి: HYDRAA Jobs: హైడ్రాలో 357 ఉద్యోగాలు.. ఆ మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక!
Ride-hailing giant #Uber has announced a significant change in its operational model for auto drivers in India, shifting from a commission-based system to a Software-as-a-Service (#SaaS) subscription model.
— Mint (@livemint) February 19, 2025
As part of this transition, all auto rides booked via the #UberApp will… pic.twitter.com/lf3jkhUXmB
ఇది కూడా చూడండి: BRS vs Congress: రాజలింగమూర్తి హత్య కేసుపై స్పందించిన గండ్ర వెంకట రమణారెడ్డి..
కొత్త సర్వీసులను తీసుకొచ్చిన ఉబర్..
ఆటో డ్రైవర్లు సాఫ్ట్‌వేర్-యాజ్-ఎ-సర్వీస్ (SaaS) ఆధారిత జీరో కమిషన్ మోడల్‌ను అనుసరించేలా సర్వీస్‌ను తీసుకురానుంది. ఇప్పటి వరకు కిలోమీటర్ల కౌంట్ ప్రకారం డబ్బులు వసూలు చేసి.. సర్వీస్ ఛార్జీలను తగ్గించి మిగతా డబ్బులను డ్రైవర్ల ఖాతాలోకి జమ చేస్తుంది. దీంతో డ్రైవర్లపై తీవ్ర ప్రభావం పడింది. ఈ క్రమంలోనే ఉబర్ కొత్త సర్వీస్‌ను తీసుకొస్తోంది. కస్టమర్ డ్రైవర్‌కు డైరెక్ట్‌గా డబ్బులు చెల్లించాలి. నగదు రూపంలో లేదా యూపీఐ ద్వారా మాత్రమే చెల్లించాలి.
ఇది కూడా చూడండి: Aaryan Shukla: 14ఏళ్ల మహారాష్ట్ర కుర్రాడు.. ఒకేరోజు 6 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్స్ ఎలా క్రియేట్ చేశాడంటే..?
క్రెడిట్, డెబిట్ కార్డులు, ఉబర్ యాప్ ద్వారా ఇంటిగ్రేటెడ్ యూపీఐ, ఉబర్ క్రెడిట్‌లు వంటి ద్వారా కూడా పేమెంట్స్ చేయడానికి వీలు లేదు. ఈ కొత్త సర్వీస్ ద్వారా చెల్లింపులు అన్ని కూడా డైరెక్ట్‌గా డ్రైవర్ అకౌంట్‌లోకి వెళ్తాయి. ఈ కొత్త సర్వీస్ వల్ల డ్రైవర్లు ప్రతీ ట్రిప్‌కు కూడా సంస్థకు కమిషన్ చెల్లించక్కర్లేదు. అలాగే రైడ్ బుకి చేసి క్యాన్సిల్ చేసినా, లేకపోతే సరైన సమయానికి రాకపోయినా, బేరాలు ఆడినా కూడా సంస్థ బాధత్య వహించాలి. అలాగే రైడ్ విషయంలో ఏవైనా భద్రతా సమస్యలు తలెత్తితే మాత్రం.. యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని కంపెనీ తెలిపింది.
ఇది కూడా చూడండి: రాజలింగం హత్య వెనుక కేసీఆర్, కేటీఆర్, హరీశ్.. మంత్రి కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు!